breaking news
Maithili Thakur
-
ఆట, పాట గెలిచాయి
చాంపియన్ స్పోర్ట్ షూటర్ శ్రేయసి సింగ్, స్టార్ సింగర్ మైథిలీ ఠాకూర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో.... ‘ఆడినంత సులువు కాదు’ ‘పాడినంత సులువు కాదు’ అన్నారు విమర్శకులు. అయితే ఈ ఇద్దరూ ఆడినంత తేలిగ్గానే, పాడినంత సులువుగానే బిహార్ తాజా ఎన్నికలలో విజయం సాధించారు. భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువ మహిళా నాయకుల గురించి...ఈసారి కూడా గురి తప్పలేదు!బిహార్ లోని జముయి నియోజక వర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచిన శ్రేయసి సింగ్ ఒకప్పుడు చాంపియన్ స్పోర్ట్ షూటర్. శాసనసభ్యురాలిగా ఇది ఆమె రెండో విజయం. బిహార్ జముయి జిల్లాలోని గిదౌర్కు చెందిన శ్రేయసి సింగ్‌కు ఘనమైన క్రీడా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తాత సెరేందర్‌సింగ్, తండ్రి దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షులుగా పనిచేశారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి మాజీ ఎంపీ.దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో చదువుకున్న శ్రేయసి ఫరిదాబాద్‌లోని మానవ్ రచనా ఇంటర్నేషల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి షూటింగ్ చూస్తూ పెరగడం వల్ల సహజంగానే ఆ క్రీడపై ఆమెకు ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి నైపుణ్యం తోడు కావడంతో షూటింగ్లో గురి తప్పకుండా దూసుకుపోయింది. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శ్రేయసి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరి 2020 బిహార్ శాసన సభ ఎన్నికల్లో జముయి నియోజక వర్గం నుంచి గెలిచింది. యువత, మహిళ ఓటర్లను ఆకర్షించగల చరిష్మా, కుటుంబ రాజకీయ నేపథ్యం వల్ల బీజేపీ శ్రేయసీకి సీటు ఇచ్చింది. పురుషాధిపత్యం కనిపించే బిహార్ రాజకీయ రణక్షేత్రంలో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే క్షేత్రస్థాయి నుంచి బిహార్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న శ్రేయసి ఎప్పుడూ తడబడలేదు. వెనకబడిన రాష్ట్రమైన బిహార్‌లో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి శ్రేయసి సింగ్ రోల్‌మోడల్‌గా మారింది. స్త్రీ విద్య, ఉపాధి కోసం రాజకీయ వేదికగా క్రియాశీలంగా పనిచేస్తోంది.చారిత్రక విజయ గీతం‘సంగీతంలో పుట్టింది. సంగీతంతో పెరి గింది’ అనే మాట మైథిలి ఠాకూర్‌కు సరిపోతుంది. బాల్యం నుంచి ఆమెకు శాస్త్రీయ, జానపద సంగీతంతో అనుబంధం ఉంది. ‘లిటిల్ చాంప్స్’ ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోల ద్వారా చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారింది. ‘జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. తొలి ఆల్బమ్ ‘యా రబ్బా’తో సంగీత అభిమానుల ప్రశంసలు అందుకుంది. మరుసటి సంవత్సరం ‘రైజింగ్ స్టార్’లో రన్నరప్‌గా నిలిచింది.ఆలీనగర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా ఆర్జేడీ అభ్యర్థిపై విజయం సాధించిన మైథిలీ ఠాకూర్ బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీటును గెల్చుకోవడం బీజేపికి ఇది మొదటిసారి. దీనిని చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. బిహార్ అసెంబ్లీకి ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలిగా సంచలనం సృష్టించి దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తోంది 25 సంవత్సరాల మైథిలీ ఠాకూర్. ఎన్నికల ప్రచార యాత్రలలో జానపద, భక్తిగీతాలు ఆలపిస్తూ జనాలను ఆకట్టుకుంది. ఇతరుల కంటే భిన్నంగా సామాజిక సంస్కరణకు, సాంస్కృతిక పునర్జీవనాన్ని మిళితం చేసి తనదైన ఎజెండాను రూపొందించింది ఠాకూర్. మిథిల చిత్రకళను పాఠశాలల్లో పాఠ్యేతర అంశం (ఎక్స్ట్రా–కరికులర్ కంపోనెంట్)గా ప్రవేశపెడతామని, బాలికల కోసం బలమైన విద్యాకార్యక్రమాలు, స్థానిక యువత కోసం ఉపాధి–కేంద్రీకృత కార్యక్రమాలు, మిథిల చిత్రకళ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది మైథిలీ ఠాకూర్. -
25 ఏళ్లకే ఎమ్మెల్యేగా అడుగుపెట్టనున్న సింగర్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సింగర్ ఘనవిజయం సాధించింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే జానపద సింగర్ ఎమ్మెల్యేగా ఎంపికైంది. బీజేపీ నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సింగర్ మైథిలీ ఠాకూర్.. అలీనగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 11 వేలకు పైగా మెజార్టీలో గెలుపొందింది.కాగా.. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్.. బీహార్‌లోని మధుబన్ జిల్లా బెనిపట్టి ఆమె సొంతూరు. జానపద సింగర్‌గా శిక్షణ తీసుకున్న మైథిలి పలు రియాలిటీ షోల్లో పాల్గొంది. స రే గ మ ప లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్, రైజింగ్ స్టార్ రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా రాణించింది. మైథిలి సొంత యూట్యూబ్ ఛానెల్‌కు 5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు 6.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్న మైథిలి.. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Youngest MLA of state , Maithali ThakurAll the best to her 🙏🏻 pic.twitter.com/BO70ciAzLW— Bihar_se_hai (@Bihar_se_hai) November 14, 2025 -
జాక్‌పాట్ కొట్టేసింది..ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే సీటు!
పాట్నా: ప్రముఖ ఫోక్ సింగ్ మైథిలీ ఠాకూర్ జాక్ పాట్ కొట్టేశారు. బుధవారం బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు. బిహార్ బీజేపీ రెండవ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 12 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా, అలీనగర్ నియోజకవర్గం నుంచి ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన అలీనగర్ స్థానాన్ని మైథిలీ ఠాకూర్‌కు కట్టబెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. మిథిలాంచల్ ప్రాంతానికి చెందిన మైథిలీ ఠాకూర్ ఈ ప్రాంతపు సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందారు. మిథిలాంచల్ అనేది భారత్–నేపాల్ మధ్య విస్తరించిన సాంస్కృతిక ప్రాంతం. సీతమ్మతల్లి జన్మస్థలంగా ఈ ప్రాంత స్థల పురాణాలు చెబుతున్నాయి. అలీనగర్ నియోజకవర్గం, దర్భంగా జిల్లాలో ఉంది. ఇది కూడా మిథిలాంచల్‌లో భాగమే. అందుకే మైథిలీ ఠాకూర్‌ను ‘మిథిలా కుమార్తె’గా అభివర్ణిస్తూ, ప్రాంతీయ గౌరవాన్ని, యువతలో ఆదరణను ఆకర్షించేందుకు బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.మైథిలీ ఠాకూర్ ఇంటర్ చదువుకున్న తర్వాత, చిన్న వయస్సులోనే ఫోక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భోజ్‌పురి, మైథిలీ, హిందీ భక్తి పాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పాడిన పాటలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా యువతను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జేడీయూ చేతిలో ఉండగా, ఈసారి పొత్తు కారణంగా బీజేపీకి దక్కింది. #WATCH | Ahead of #BiharElection2025, folk and devotional singer Maithili Thakur joins the BJP in Patna, Bihar. pic.twitter.com/qkY1ocUsIZ— ANI (@ANI) October 14, 2025క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం పొందారు. ఓవైపు ఫోక్ సింగర్‌గా రాణిస్తూనే రాజకీయాల్లో రాణించాలని కోరికగా ఉందంటూ పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె తన అభిరుచులకు అనుగుణంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,బిహార్ సీఎం నితీష్ కుమార్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. వారిలాగే తానుకూడా సమాజానికి సేవ చేయడానికి, బిహార్ అభివృద్ధికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.కాగా,మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’పాటను ప్రధాని ప్రశంసించారు. अयोध्या में प्राण-प्रतिष्ठा का अवसर देशभर के मेरे परिवारजनों को प्रभु श्री राम के जीवन और आदर्शों से जुड़े एक-एक प्रसंग का स्मरण करा रहा है। ऐसा ही एक भावुक प्रसंग शबरी से जुड़ा है। सुनिए, मैथिली ठाकुर जी ने किस तरह से इसे अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan…— Narendra Modi (@narendramodi) January 20, 2024


