Tollywood Actress
-
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్..!
కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్‌తో ఓ సినిమా చేస్తోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ వైరల్‌గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్‌లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్‌తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్‌పై డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. -
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.పర్సనల్ లైఫ్..కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. -
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.(చదవండి: రామ్ చరణ్ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్!)తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.ఏడాదిగా రూమర్స్.. శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. -
'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్
టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్‌కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్‌కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్‌కు వెళ్లినప్పుడు.. షూట్లో లేకుండా మీరు షాపింగ్‌కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్ వరకు వచ్చాక మీరు షూటింగ్ లోకేషన్లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్ఎక్స్లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మెప్పించింది. -
బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆహా అనిపిస్తున్న అనసూయ (ఫొటోలు)
-
క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న నటి పూజిత పొన్నాడ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ.. కేన్స్‌లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్‌లో అనన్య పాండే..జిమ్‌లో బిగ్‌బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్‌లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్‌లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మేకప్ లేకున్నా అదే అందం.. సాయిపల్లవి జపాన్ ట్రిప్ (ఫొటోలు)
-
#HBDAnasuya : రంగమ్మత్త (అనసూయ) జర్నీలో ఎన్ని మలుపులో! (ఫొటోలు)
-
స్టైల్ మార్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (ఫొటోలు)
-
బిగ్‌బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్‌బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్‌లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్‌కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. -
అంజలి కీలక పాత్రలో 'ముసలోడికి దసరా పండుగ'.. రిలీజ్‌కు రెడీ
నాజర్, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సందర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకముంది. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు. -
బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్‌లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్‌లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్‌లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
హీరోయిన్ లయ చెస్ ఛాంపియనా?.. పోస్ట్ వైరల్
అప్పట్లో హీరోయిన్గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్‌స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'నలుగురు పిల్లల అమ్మాయితో పెళ్లి'.. ఆసక్తిగా టీజర్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి సినిమానే. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ కీలక పాత్రల్లో నటించారు. -
'తప్పు నాదే.. ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు'.. లయ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ లయ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హిట్ పెయిర్ అయిన శివాజీ సరసన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అంటోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అప్పట్లో తాను ఓ సినిమా చేసినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. స్వయంవరం తర్వాత వడ్డే నవీన్ సరసన మా బాలాజీ అనే మూవీలో విడో పాత్రలో కనిపించానని వివరించింది. అయితే ఆ సినిమా కథ రెమ్యునరేషన్ గురించి తాను అడగలేదని తెలిపింది. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని తర్వాత అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం కోడి రామకృష్ణ గారిపై ఉన్న గౌరవంతో కథ వినకుండానే చేశానని తెలిపింది. ఆ సినిమాను ఇప్పటి వరకు తాను చూడలేదని లయ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడో పాత్రలో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. -
వైట్ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ.. భర్తకు స్నేహా స్పెషల్ విషెస్..!
నిన్నుకోరి మూవీ రీ రిలీజ్ ఆనందంలో నివేదా థామస్..భర్తకు హీరోయిన్ స్నేహ స్పెషల్ విషెస్..ఎల్లో డ్రెస్‌లో టాలీవుడ్ నటి బిందు మాధవి హోయలు..వైట్ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు..కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి మదర్స్ డే సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Divya Arundati (@divya_arundathi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Vennela Manthri (@vennelamanthri) -
'సినిమా ఛాన్స్.. ఫామ్‌హౌస్‌కు వస్తే రూ.25 లక్షలు..' బిగ్‌బాస్ కిర్రాక్ సీత
బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన టాలీవుడ్ బ్యూటీ కిర్రాక్ సీత. బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్‌గా అభిమానులను మెప్పించింది. మొదట యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన సీత 7 ఆర్ట్స్ సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. అంతే కాకుండా బేబీ మూవీలో హీరోయిన్ పక్కన ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ రోల్లో అద్భుతంగా నటించింది. బిగ్‌బాస్ షో మరింత ఫేమ్ తెచ్చుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తనకెదురైన అనుభవాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టింది. ఓ సారి సినిమా ఛాన్స్ అని కాల్ చేసి అడిగారని తెలిపింది. 7 ఆర్ట్స్‌లో చేసే సమయంలోనే సినిమా ఛాన్స్ ఉందని ఫోన్ చేసి చెప్పారని గుర్తు చేసుకుంది. అయితే ఫామ్ హౌస్‌కి రావాలిని పిలిచారని తెలిపింది. మొదట సరే అన్నా.. కానీ నేను వెళ్లలేదు.. మళ్లీ రెండు రోజుల తర్వాత కాల్ చేసి అడిగారని పేర్కొంది. ఇక్కడికి వస్తే మీకు రూ.25 లక్షలు ఇస్తారని చెబితే నేను సున్నితంగా తిరస్కరించానని సీత వెల్లడించింది.కొంతమంది ఇలా నంబర్ దొరికితే చాలు కాల్ చేస్తుంటారని కిర్రాక్ సీత తెలిపింది. కేవలం టైమ్‌పాస్‌కు కూడా ఇలా కాల్స్ చేస్తారని వివరించింది. ఎలా ఉంటది అని నేను అడుగుతా.. ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదా?? అని అంటారని పేర్కొంది. అప్పుడు నేను వెంటనే ఇలా అడగడానికి మీకు సిగ్గుందా? అని వెంటనే ఇచ్చిపడేస్తానని సీత వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
'నమ్మి డబ్బులిస్తే మోసం చేశారు'.. సంజనా షాకింగ్ కామెంట్స్
సంజనా గల్రానీ.. ఈ పేరు గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. గతేడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో మెరిసింది. ఏకంగా టాప్-5 నిలిచిన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తనకెదురైన అనుభవాలను పంచుకుంది.తాజా ఇంటర్వ్యూలో సంజనా షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. నాకు తెలిసిన వాళ్లను నమ్మి దాదాపు రెండు కోట్లు మోసపోయానని తెలిపింది. నన్ను మోసం చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద నిర్మాత కూడా ఉన్నారని వెల్లడించింది. ఇప్పటికీ కూడా ఆ చెక్ బౌన్స్ కేసులు ఇంకా నడుస్తున్నాయని సంజనా గల్రానీ తెలిపింది. ఇప్పుడు ఎవరైనా నన్ను డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వట్లేదని వెల్లడించింది. అయితే తనకు డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. -
హైదరాబాద్‌లో జోరుగా హుషారుగా...
ఉదయం షూటింగ్‌కి వెళ్లడం... రాత్రికి ఇంటికి చేరుకోవడం... ఇలా లోకల్లో షూటింగ్ చేసినప్పుడు స్టార్స్ ఇంటిని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు స్టార్స్ అలా ఇంటిని మిస్ కాకుండా హైదరాబాద్‌లో జోరుగా హుషారుగా షూట్‌తో బిజీగా ఉంటున్నారు. ఆ స్టార్స్ ఏయే సినిమాల షూట్లో ఉన్నారో తెలుసుకుందాం.గండిపేటలో కింగ్తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. తన కెరీర్లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున ఫిల్మ్ జర్నీలో ఓ మైల్స్టోన్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తన అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నాగార్జునతో పాటు నటి టబు పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. –టబు కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అదే విధంగా ‘సిసింద్రి’ సినిమాలోనూ వీరిద్దరూ ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కింగ్ 100’ మూవీ కోసం వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరి రీ యూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున కెరీర్లో ఓ ల్యాండ్‌మార్క్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్ గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట ఆయన. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2027 జనవరికి విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జన్వాడలో...‘వీర సింహారెడ్డి’ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో ‘గుంటూరు కారం’ మూవీ సెట్లో జరుగుతోందని తెలిసింది.బాలకృష్ణతో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట గోపీచంద్ మలినేని. ఈ మూవీలో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి... వీరిద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారు? లేదంటే మరో హీరోయిన్ ఖరారు అవుతారా? అనేది వేచి చూడలి. ఇదిలా ఉంటే... ‘ఎన్బీకే 111’లో ఓ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ చిందేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటని చిత్రీకరించనున్నారట మేకర్స్.అన్నపూర్ణలో ఆదర్శ కుటుంబం‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమాతో తన కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు వెంకటేశ్. అంతేకాదు... ఈ మూవీ ద్వారా రూ. 300కోట్ల వసూళ్ల క్లబ్లో చేరి, సరికొత్త రికార్డును సృష్టించారాయన. ఈ చిత్రం తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గ అందమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారట త్రివిక్రమ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పాటు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించిన ఓ హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. వెంకటేశ్ హీరోగా నటించిన పలు హిట్ సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన హీరోగా తన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా కీర్తీ సురేష్ నటిస్తారు. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో రూపొందనున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. గండిపేటలో వారణాసిమహేశ్బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. మహేశ్ హీరోగా నటిస్తున్న 29వ సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన ఆయన గెటప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ఎపిక్ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు.‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఆర్ఎఫ్సీలో... ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ చేస్తున్న ఆయన మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా పాల్గొంటున్నారాయన. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్న్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారట. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.పీరియాడికల్ యాక్షన్‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.పీరియాడికల్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర తారాగణంపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అంతేకాదు... ముఖ్యంగా కోల్కత్తా ప్రస్తావన ఉంటుందట.ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీలో టు షేడ్స్‌లో కనిపించనున్నారట ఎన్టీఆర్. ఓ లుక్‌లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిట. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలో,్ల అటు ప్రేక్షకుల్లో బజ్ నెలకొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానుంది. అజీజ్‌నగర్‌లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంకల్ప్ రెడ్డి. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘భరత వర్ష’.గోపీచంద్ ఈ మూవీలో యోధుడి పాత్ర కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజెన్న్స్ అన్నీ కలిసి ఈ పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చేస్తాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ నటిస్తున్నారు. ఇన్నోవేటివ్ కథనాలు, హై టెక్నికాల్టీకి పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి... భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా తెరపై ఆవిష్కరించబోతున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘గోపీచంద్ 34’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ముచ్చింతల్‌లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘ఆయా షేర్...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ డ్రామా శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శగుతోంది.ఈ షెడ్యూల్లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంపత్ నంది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్న్స్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అద్భుతమై సంగీతం అందించారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శంకర్‌పల్లిలో... హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ 2023 జూన్ 28న విడుదలై థియేటర్లలో నవ్వులు కురిపించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హిలేరియస్ కామెడీ డ్రామా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమా ద్వారా ‘సామజవరగమన’ చిత్రాన్ని మించిన నవ్వులు పంచాలనే బలమైన ఆలోచనతో తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాలో ‘మోగ్లీ’ మూవీ ఫేమ్ సాక్షీ మదోల్కర్ కథానాయికగా నటించనున్నారని టాక్. ‘వెన్నెల’, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
జిమ్ డ్రెస్‌లో నభా నటేశ్.. అనన్య నాగళ్ల స్మైలీ లుక్స్..!
జిమ్ డ్రెస్‌లో హీరోయిన్ నభా నటేశ్..సద్గురు ఫౌండేషన్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..స్మైలీ లుక్స్‌తో హీరోయిన్ అనన్య నాగళ్ల పోజులు..వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్..వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Prakriti 💫 (@prakritikakar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
విష్ణుప్రియ స్టన్నింగ్ పోజులు.. శారీలో పుష్ప బ్యూటీ పావని..!
రెడ్ డ్రెస్‌లో యాంకర్ విష్ణు ప్రియ స్టన్నింగ్ పోజులు..ఏప్రిల్ జ్ఞాపకాలు నెమరు వేసుకున్న యషిక ఆనంద్..శారీలో మరింత అందంగా పుష్ప బ్యూటీ పావని..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ నుస్రత్..చీరతో ముసుగేసిన ఐటమ్ సాంగ్ గర్ల్ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
అనుకున్నదే అయింది.. సమంత బంగారం వాయిదా..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదల కానుందని ప్రకటించారు.ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. జూన్‌కు వాయిదా..అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ముందుగా ఊహించినట్లుగానే మా ఇంటి బంగారాన్ని పోస్ట్‌పోన్ చేశారు. ఈ మూవీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చేనెల అంటే జూన్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఈమె టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికీ ఇష్టముండదు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే అవే గుర్తుకొస్తాయి. 90స్ కిడ్స్‌కు మొబైల్ కెమెరాలు లేక సరిపోయింది కానీ.. ఇంకా ఎన్నో మధుర జ్ఞాపకాలను చూసుకుంటూ ఉండేవాళ్లం. ఎంత గొప్పవారికైనా అలాంటి అరుదైన ఫోటోలు, వీడియోలు చూస్తే ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోతాం. మనల్ని మనం చూసుకుంటూ అప్పుట్లో ఇలా ఉన్నామా అని సంబరపడిపోతాం. అలా తన పాత ఫోటోలను షేర్ చేసింది బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇండోర్‌లో జరిగిన లైవ్ షో ఫోటోలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చంది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె మన తెలుగింటి కోడలు అన్న సంగతి తెలుసు. ఆమె సిస్టర్ శిల్పా శిరోద్కర్ గురించి చాలామందికి తెలియదు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకైతే సుపరిచితమే. గతేడాది బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇటీవల బాగానే ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర్ మూవీలోనూ నటించింది. గతంలో టాలీవుడ్లో బ్రహ్మ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా 90స్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
అరుదైన దృశ్యం.. ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య..!
నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి విరూపాక్ష’ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఓకే వేడుకలో మెరిశారు. చైతూ తన భార్య శోభిత ధూళిపాళ్లతో పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఇదే రిసెప్షన్‌కు సమంత సైతం తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరు ప్రముఖ నిర్మాత, ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ హాజరు కావడం విశేషం.వీరిద్దరు విడిపోయి పెళ్లిళ్లు చేసుకున్నాక ఓ వేడుకలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఒక్కసారిగా అందరి కళ్లు వీరిద్దరిపైనే పడ్డాయి. ఇదే రిసెప్షన్లో నాగార్జున, అమల సైతం కనిపించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Naga Chaitanya and Sobhita Dhulipala at Simran (Sunil Narang's daughter) - Krish wedding reception. pic.twitter.com/zgVOmb4ABa— idlebrain.com (@idlebraindotcom) May 3, 2026 #TFNExclusive: All smiles as #Samantha along with her husband #RajNidimoru graced #SunilNarang’s daughter’s reception ❤️✨#SimranKrish #TeluguFilmNagar pic.twitter.com/twIKpdrAAz— Telugu FilmNagar (@telugufilmnagar) May 2, 2026 -
గ్రీన్ డ్రెస్‌లో నిహారిక కొణిదెల.. డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో సుప్రీత..!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..ఆరెంజ్ డ్రెస్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..పచ్చని డ్రెస్‌లో ప్రకృతిలో కలిసిపోయిన నిహారిక కొణిదెల..పార్టీలో యాంకర్ రష్మీ గౌతమ్ చిల్..డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ సుప్రీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
మనుషులనే వదలరు.. కుక్కలను వదిలేస్తారా?.. రేణు దేశాయ్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మూగ జీవాలకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడైనా వాటిని హింసించినా.. హానీ తలపెట్టినా తన దృష్టికి వస్తే రియాక్ట్ అవుతూ ఉంటోంది. తాజాగా కొద్ది రోజులుగా కుక్కల రక్తం తీసి అమ్ముకుంటున్నారని ఓ వార్త తెగ వైరలవుతోంది. హైదరాబాద్‌లోనే ఈ దందా నడుస్తోందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ అయింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..'గత మూడు రోజులుగా మనం వింటున్నాం. అసలు ఈ రక్తం ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? ఇద్దరిదీ తప్పే. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేవారు కుక్కలను వదిలేస్తారా? కానీ కొంచమైనా భయం, భక్తితో ఉండండి. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ మన పిల్లకు తగులుతుందని మైండ్‌లో పెట్టుకోండి. కుక్కల రక్తంతో డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. వీధి కుక్కలతో ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కుక్కలు, పిల్లులతో ఇలా చేస్తే అది పెద్ద కర్మ. అందరికీ డబ్బు కావాలి. కానీ ఇలా సంపాదించడమనేది ఎంతవరకు సమంజసం' అంటూ మాట్లాడింది.నిన్న కూడా ఫస్ట్ టైమ్ నన్ను మోసం చేశారని రేణు తెలిపింది. మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే పగిలిన పోయినవి వచ్చాయని వెల్లడించింది. ముసలి వాళ్లను టార్గెట్ చేసి.. ఓటీపీలు తీసుకుని మోసాలు చేస్తున్నారు. రాక్షసులైతేనే ఇలాంటి పనులు చేస్తారని.. మనుషులైతే ఇలా చేయరని రేణు మండిపడింది. చెడు మార్గాలు, మోసాలు, గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నాలను ఆపాలని రేణు దేశాయ్ కోరింది. నిజాయితీగా, కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడని హితవు పలికింది. ఎందుకంటే కర్మ అనేది నిజం.. అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది. ఆ దేవుడు అంతా గమనిస్తూ ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందరు సురక్షితంగా ఉండాలని రేణు దేశాయ్ కోరింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డ్యూడ్, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV— prime video IN (@PrimeVideoIN) May 1, 2026 -
సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా?
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్‌పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ టైమ్‌లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. -
పెళ్లి వేడుకలో సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉందో చూశారా?
సీనియర్ హీరోయిన్ శారద ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆమెను చూసిన మెగాస్టార్ దంపతులు దగ్గరికి వెళ్లి పలకరించారు. ప్రస్తుతం ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో శారద అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్ డైలాగ్స్తోనూ సినిమాల్లో మెప్పించారు. కాగా.. కన్యా శుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు. అయితే శారద మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటి అయినప్పిటికీ.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ రేంజ్‌కు ఎదిగారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు.. తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. తెలుగులో అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, స్టాలిన్, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు.సీనియర్ హీరోయిన్ శారద గారు...#Chiranjeevi Garu @KChiruTweets #Saradha #Actress pic.twitter.com/wzXLhpHaXs— Suresh Kondeti (@santoshamsuresh) April 29, 2026 -
సముద్ర తీరాన హన్సిక చిల్.. పెళ్లి కూతురిలా మెరిసిపోతున్న శ్రీలీల..!
సముద్ర తీరాన చిల్ అవుతోన్న హన్సిక..బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గ్లామర్ పోజులు..సమ్మర్లో మ్యాంగో తింటూ ఎంజాయ్ చేస్తోన్న సమీరా..బ్లూ డ్రెస్‌లో బిగ్‌బాస్ దివి అందాలు..పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
నటి సురేఖవాణి బర్త్ డే.. కూతురు సుప్రీత స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
'పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు'.. నిత్యామీనన్ బాటలో కట్టప్ప కూతురు
ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. -
ఈవెంట్లో పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పంజాబీలో చాలా సినిమాలు చేయడంతో పాటు హిందీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే పంజాబీ ఫిల్మ్ ఖుష్ కబరీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్(01-01-01) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సినిమాతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.పాయల్ కన్నీటి పర్యంతం..ఈ ఈవెంట్‌కు పాయల్ రాజ్‌పుత్ సినీ కెరీర్, ఆరోగ్య సమస్యల గురించి ప్రశ్నించారు. దీనికి పాయల్ స్పందించింది. తన అనారోగ్యంతో జైపూర్‌లో పది రోజులు చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. ఆ సమయంలో మా ఫాదర్‌కు క్యాన్సర్ సోకిందని తెలిపింది. నా లైఫ్‌లో రియల్ హీరో మా నాన్నే అంటూ ఎమోషనలైంది. తన తండ్రిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా సినిమాలు చూడాలని నాన్న ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూసేవాడని తెలిపింది. నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనేనని పాయల్ వెల్లడించింది. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని వేదికపై బోరున ఏడ్చేసింది. దీంతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. కాగా.. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గతేడాది జూలై 28న క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Actress Payal Rajput gets emotional while answering and walks away pic.twitter.com/ysuvKFdaxZ— idlebrain.com (@idlebraindotcom) April 28, 2026 -
సమంత బర్త్ డే స్పెషల్.. ఫుల్ యాక్షన్ వీడియో రిలీజ్
ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు కావడంతో స్పెషల్ వీడియో రిలీజైంది. సామ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రశంసలు కురిపించారు మా ఇంటి బంగారం టీమ్. ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసిన వీడియో సామ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సామ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.ఈ సందర్భంగా సామ్ నటనపై ప్రశంసలు కురిపించారు. సమంత స్టంట్స్ అదరగొట్టేశారని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ కొనియాడారు. సమంతను బీస్ట్ అంటూ ఆకాశానికెత్తారు. ఎలాంటి సీన్స్‌లోనైనా అద్భుతంగా చేయగలదని డైరెక్టర్ నందిని రెడ్డి ప్రశంసించారు. సామ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి అని డీవోపీ ఓంప్రకాశ్ అన్నారు. ఆమె యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. సామ్ భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైతం సమంత నటన ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందన్నారు. అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. కాగా.. సమంత తన సొంతం బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్‌లో ఓ పార్ట్ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. -
'నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే'.. అషురెడ్డి ఆడియో వైరల్
బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి కేసు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు కాజేసిందని ఆయన తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై అషురెడ్డి తండ్రి కూడా స్పందించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అషు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఆడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది అషురెడ్డి పెట్టిన ఆడియో అని వైరలవుతోంది.ఈ ఆడియోలో మాట్లాడుతూ.. 'ప్రవీణ అక్కకు ఫోన్ చేశావని నాకు కాల్ చేసింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. నాకు మే వరకు టైమ్ ఇస్తే రూ.1.5 కోటి ఇచ్చేస్తా. మిగిలిన డబ్బులు నా లైఫ్‌లో సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదు కుదరదు.. అంటే పెద్ద మనుషులకు ఫోన్ చేశావ్ కదా.. నా లైఫ్‌లో పెద్దమనిషి ప్రవీణ అక్కే.. నువ్వు ఎవరినీ పిలుచుకుంటావో నీ ఇష్టం. నేను ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. లేదు.. కుదరదు అంటే నేనే వేధింపుల కేసు పెడతా. మా అక్కను, అమ్మను ఇందులోకి లాగొద్దు. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి రావడమేంటి? నా తరఫున ప్రవీణ అక్క, వేణుస్వామి వస్తారు.. మే వరకు ఆ డబ్బులు సెటిల్ చేస్తా' అని ఉంది. ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
'మెగా ఇంటికి నా పిల్లలు.. వాళ్లకు చెప్పేది అదొక్కటే'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్‌లోనే ఉంటోంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. అంతేకాకుండా మూగజీవాల కోసం తన వంతు పోరాటం చేస్తున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రేణు దేశాయ్.. హీరో పవన్ కల్యాణ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆద్య, అకీరా అనే పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్లకే ఆమె పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సింగిల్‌గానే తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే పేరేంట్స్ విడిపోయినప్పటికీ పిల్లలు తన తండ్రి వద్దకు వెళ్తుంటారు. మెగా ఫ్యామిలీ ఇంటికి కూడా వెళ్తుంటారు. దీనిపై రేణు దేశాయ్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలకు ఏం చెప్తారన్న ప్రశ్నకు రేణు స్పందించింది.మీరు అక్కడికి వెళ్లి ఎలా ప్రవర్తిస్తారో అదే నా పెంపకాన్ని సూచిస్తుందని వారితో చెప్తానని రేణు దేశాయ్ తెలిపింది. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పెంచిన తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారని పేర్కొంది. అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు.అందుకే మెగా ఇంటికి వెళ్లేముందు అక్కడ మీరు ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారనేది ముఖ్యమని.. ఒక తల్లిగా నేను సరిగా పెంచానా? లేదా అన్నది డిసైడ్ అవుతుందని వారితో చెప్పానని వెల్లడించింది. ఒక మదర్‌గా నా ఇద్దరు పిల్లలను పెంచడంలో చాలా హ్యాపీగా ఉన్నానని రేణు తెలిపింది. ఒక తల్లిగా తన పెంపకంపై మచ్చ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం తన పిల్లలకు నేర్పించానని రేణు అన్నారు. -
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్పుల్గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్ లైఫ్‌లో కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఆనాటి హీరోయిన్, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్‌గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్‌తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.భర్త మోసంపై ఒంటరి పోరాటం..వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది. ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
అలాంటి ప్రశ్న వేయడమే తప్పు : శ్రియ
ఇంతకుముందు హీరోయిన్లను వెంటాడే భయాల్లో ఒకటి పెళ్లి, మరొకటి వయసు. పెళ్లి అయితే హీరోయిన్ అవకాశాలు పోతాయేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా వయసు మీరితే అందం కరిగిపోతుందనే భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడా భయం ఎవరిలోనూ కనిపించడంలేదు. పెళ్లి అయ్యి, నాలుగు పదుల వయసు దాటిన నటీమణులు కూడా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో శ్రియ ఒకరు. ఈ భామ దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందారు. కాగా వివాహానంతరం నటనకు కొద్ది కాలం దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు మళ్లీ నటించడంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించారు. ఈ భామను ఇటీవల 43 మూడేళ్ల వయసులో ఇంత అందాన్ని ఎలా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు, ఎలా అవకాశాలను అందుకుంటున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రియ బదులిస్తూ వయసును బట్టి నటీమణులను అంచనా వేయరాదంటూ ఘాటుగా పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్న వేయడమే తప్పు అన్నారు. వయసుతో పని ఏముంది? పెళ్లి అయితే నటీమణుల పని అయిపోతుంది అన్న ఆలోచనే రాకూడదు అని అన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో సాధించడానికి వయసు ఆటంకమే కాదన్నారు. ప్రతిభ ముఖ్యమని, ప్రతి భావంతులైన కళాకారులు ఏ వయసులోనైనా సాధించగలరని అన్నారు. కాగా 43 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో ఆకట్టుకుంటున్న శ్రియ ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్‌లో నటించడానికి సిద్ధం అంటున్నారు. -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్‌గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్‌లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్‌గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
రేర్ పిక్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫోటోలో ఎక్కడుందో తెలుసా?
మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఆనాటి రేర్ పిక్‌ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) -
కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్!
నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్‌ను ఆ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్‌గా టాలీవుడ్లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో ఆమెకు పెద్ద గ్యాపే వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్‌లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్‌లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్‌లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. -
చాలా ఇష్టమంటోన్న బిగ్‌బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్‌బాస్ దివి..శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్‌లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్ సినిమా
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్‌గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్‌తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026 -
డిఫరెంట్ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా?
కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా హీరోయిన్ టీనా శ్రావ్య. ఇప్పుడు మరోసారి గేదెల రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా ఆమెను ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేదెల రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో టీనా ఫర్మామెన్స్ చూస్తే ప్రామిసింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న క్యారెక్టర్స్‌లో టీనా అదరగొడుతోంది. టాలీవుడ్లో చిన్న బడ్జెట్ చిత్రాలకు ఈమె పర్ఫెక్ట్ ఆప్షన్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆమె డైలాగ్ డెలివరీతో పాటు అందం, అమాయకపు నటనా శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈనెల 24న విడుదల కానున్న గేదెల రాజు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ శ్రియా శరణ్..పాలరాతిలా మెరిసిపోతున్న హీరోయిన్ లక్ష్మీ ప్రణీత..శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..హ్యాపీ ఎర్త్ డే అంటోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'నా సోనును కోల్పోయా'.. బిగ్‌బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్
బిగ్‌బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ. బిగ్‌బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్‌తో హౌస్‌లో అలరించింది. ఈ షో ద్వారా టాలీవుడ్లో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది.తాజాగా బిగ్‌బాస్ అశ్విని శ్రీ కన్నీటి పర్యంతమైంది. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిన విషాద వార్తను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ ఫుల్ ఎమోషనలైంది. సోనుకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లే చనిపోయాడని అశ్విని శ్రీ తెలిపింది. అశ్విని శ్రీ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను నా సోను బాయ్‌ని కోల్పోయా.. ఈ బాధ భరించరానిది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నా అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
కథకు కీ అయ్యారు
ఈ తరం హీరోయిన్స్ సూపర్ స్మార్ట్. కేవలం కమర్షియల్ హీరోయిన్ అంటూ ఒకే జానర్‌కు పరిమితం కావాలనుకోవడం లేదు. యాక్షన్ సినిమాలకూ సై అంటున్నారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాల సవాళ్లను స్వీకరిస్తున్నారు. ఇప్పుడు కథలో కీలక పాత్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉన్న సినిమాలో, కీలక పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న కొంతమంది హీరోయిన్ల గురించి ఓ లుక్ వేద్దాం.పవర్ఫుల్ రోల్ కథ నచ్చితే చాలు... హీరోయినా? లేక కీ రోలా? అని అస్సలు ఆలోచించరు శ్రుతీహాసన్. ఒకవైపు ప్రభాస్ ‘సలార్’ వంటి భారీ సినిమాలో హీరోయిన్గా చేశారు శ్రుతీహాసన్. ‘సలార్ 2’ చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ఇద్దరు చెల్లెళ్లు ఉన్న అక్క పాత్రలో శ్రుతీహాసన్ నటించారు. ఇప్పుడు మరోసారి మరో బలమైన కథలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారీ బ్యూటీ.అది ఏ సినిమా అంటే... ‘ఆకాశంలో ఒక తార’ అన్నమాట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోనే శ్రుతీహాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి, ఈ ఏడాదే ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. రాయ సిస్టర్ గంగ? చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో హీరోయిన్గా నటించారు నయనతార. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. బాలకృష్ణ కొత్త సినిమాలోనూ నయనతార హీరోయిన్గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారు. ఇలా హీరోయిన్గా వరుస అవకాశాలు లభిస్తున్నప్పటికీ నయనతార కథకు కీలకమైన ఓ కీ రోల్ చేశారు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2’ వంటి చిత్రాల తర్వాత యశ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్’. గోవా నేపథ్యంలో 1940–1970 కాలమానంలో సాగే పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది.ఈ చిత్రంలో రాయ, టికెట్... ఇలా ద్వి పాత్రాభినయం చేస్తున్నారు యశ్. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథ ప్రధానంగా తండ్రీకొడుకుల మధ్య సాగే రివెంజ్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఈ కథలోనే రాయ పాత్రకు సిస్టర్ గంగ పాత్రలో నయనతార నటిస్తున్నారని తెలిసింది. కథకు ఎంతో కీలకమైన పాత్ర ఇది. ఇక ఈ సినిమాలోని మెయిన్ హీరోయిన్స్‌గా రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ నటిస్తున్నారని తెలిసింది. మెలిస్సాగా రుక్మిణీ వసంత్, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కాగా తారా సుతారియా, ఎలిజెబెత్‌గా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. మాన్స్టర్ మైండ్స్, కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.రాకాలో రష్మిక ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘రాకా’. ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల్లో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మికా మందన్నా నటించారు. అయితే ‘రాకా’లోనూ రష్మికా మందన్నా ఉన్నారని తెలిసింది. కానీ ఆమెది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉండే విలన్ రోల్ అని తెలిసింది. కమర్షియల్ సినిమా హీరోయిన్గా సూపర్ హిట్ అయిన రష్మికా మందన్నా, ఇటీవల ‘ది గాళ్‌ఫ్రెండ్’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లోనూ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు విలన్ రోల్లో తన సత్తా ఏంటో చూపించేందుకు రష్మికా మందన్నా రెడీ అవుతున్నట్లుగా తెలిసింది.ఆల్రెడీ రష్మిక ‘రాకా’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిసింది. ‘రాకా’ చిత్రీకరణ ఎక్కువగా ముంబైలో జరుగుతోంది. ఫిబ్రవరి నెల స్టార్టింగ్‌లో ముంబైలో జరిగిన ఈ సినిమా షూట్లో రష్మిక పాల్గొన్నారని, ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మరి... రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుంటే హీరోయిన్ ఎవరు? అనే డౌట్ రావొచ్చు. కథ రీత్యా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. రష్మికా మందన్నా నెగటివ్ రోల్ చేస్తుండగా, మరో కీలక పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ భాగమైన విషయాన్ని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్స్‌గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కనిపిస్తారని సమాచారం.ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారని, ఇందులో తండ్రి, ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలో ఓ విలన్‌గా కూడా అల్లు అర్జున్ కనిపిస్తారట. ఈ చిత్రానికి పునర్జన్మల కాన్సెప్ట్ ఉంటుందని, ఆడియన్స్‌ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లేలా ఈ చిత్రదర్శకుడు అట్లీ కథ తయారు చేశారని తెలిసింది. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం.. వంటి కారణాల చేత ‘రాకా’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని, షూటింగ్ మాత్రం ఈ ఏడాదే పూర్తి అవుతుందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.సంబరాల్లో... తెలుగుతెరపై హీరోయిన్గా ‘మల్లేశం, పొట్టేల్’ వంటి చిత్రాలతో సక్సెస్ అయ్యారు హీరోయిన్ అనన్య నాగళ్ల. కానీ కుదిరినప్పుడల్లా కీలక పాత్రలూ చేస్తున్నారామె. ‘డార్లింగ్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు అనన్య. తాజాగా సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, సంజయ్ దత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా సాగుతోంది.కాకాజీ కుమార్తెగా? ‘వాల్తేరు వీరయ్య’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ్ర పారంభం కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇంకా స్టార్ట్ కాలేదు. అతి త్వరలోనే ఆరంభమవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, చిరంజీవి కుమార్తె పాత్రలో అనశ్వర రాజన్ నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. గత ఏడాది డిసెంబరులో విడుదలైన రోషన్ మేక ‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగులోకి వచ్చారు అనశ్వర రాజన్. ఆమె హీరోయిన్గా ఇటీవల వచ్చిన ‘విత్ లవ్’ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇంకా అనశ్వర హీరోయిన్గా నటించిన ‘ఇట్లు అర్జున, 7/జీ బృందావన కాలనీ 2’ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇలా హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తున్న అనస్వర ‘కాకాజీ ’ చిత్రంలో కథకు కీలకమైన కుమార్తె పాత్రలో నటించనుండటం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది ్ర పారంభంలో రిలీజ్ కానుందని సమా చారం. ఇలా కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. మరికొంతమంది హీరోయిన్స్ కథకు కీలకమైన పాత్రల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. – ముసిమి శివాంజనేయులు -
ధనుశ్‌తో డేటింగ్ రూమర్స్.. వీరిద్దరు ఆ పని చేయనున్నారా?
సీతారామం ఫేమ మృణాల్ ఠాకూర్ ఇటీవలే డకాయిట్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ గురించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుశ్ డైరెక్షన్లో ఆమె పని చేయనున్నారని లేటేస్ట్ టాక్. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కోసం మృణాల్‌ను సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా.. 1960 లేదా 1970ల కాలానికి సంబంధించిన ఒక 'పీరియడ్ డ్రామా'గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.అయితే తాజాగా వీరిద్దరి సినిమా గురించి టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు వీరి రిలేషన్‌పై చర్చ మొదలైంది. గతంలో మృణాల్- ధనుశ్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. గతేడాది ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్ వేడుకలో ధనుశ్ కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతకుముందు ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' సినిమా ముగింపు వేడుకలో మృణాల్ ఠాకూర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ధనుష్ కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో అవ్వడంతో వీరిద్దరు రిలేషన్‌కు మరింత బలం చేకూరింది. అయితే తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఎక్కడా నోరు విప్పలేదు. గతంలో తన మూవీ 'దో దీవానే షహర్ మే' ఈవెంట్లో పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై మృణాల్ ఠాకూర్ స్పందించారు. తనపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇటువంటి వార్తలు చాలా సందర్భాల్లో నిరాధారంగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ధనుశ్ నటించిన 'కారా' మూవీ విడుదల కానుంది. 1991 గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
దుర్గమ్మ సేవలో రంభ.. రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో తన అందచందాలతో స్టార్ హీరోయిన్గా మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత వెంటనే తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, బోజ్‌పురి ఏకంగా ఎనిమిది భాషల్లో 100కుపైగా చిత్రాల్లో నటించారు.ఇదిలా ఉంచితే తాజాగా రంభ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది వస్తానని తెలిపారు. నేను విజయవాడలోనే పుట్టాను.. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని హీరోయిన్ రంభ తెలిపింది. చిన్నప్పటి దుర్గమ్మ గుడికి వస్తున్నానని వెల్లడించింది.సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు రంభ స్పందించింది. ఇప్పుడైతే ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదని వెల్లడించింది. కొన్ని కథలు విన్నానని.. నాకు సరిపోయే రోల్స్ రాలేదని రంభ చెప్పింది. ఆ కథల్లో ఏవీ తనకు నచ్చలేదని పేర్కొంది. కాగా.. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఇంద్రకుమార్ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్
సామాజిక మాధ్యమాలలో టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ లక్ష్యంగా అసభ్యకరమైన సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దొరెపల్లి చంటి(30)గా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను చంటిదొరెపల్లి అనే పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నారు.కాగా..ఇటీవలే జనార్ధన్ అనే నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 23న పలువురు సోషల్ మీడియాలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్ చేసి.. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 🚔 𝐂𝐑𝐀𝐂𝐊𝐃𝐎𝐖𝐍 𝐎𝐍 𝐂𝐘𝐁𝐄𝐑 𝐁𝐔𝐋𝐋𝐘𝐈𝐍𝐆 🚔The @CyberCrimesCyb Police have apprehended an individual for targeting actress Anasuya Bharadwaj with defamatory and obscene social media content.𝐐𝐮𝐢𝐜𝐤 𝐂𝐚𝐬𝐞 𝐅𝐚𝐜𝐭𝐬:𝐓𝐡𝐞 𝐀𝐫𝐫𝐞𝐬𝐭: Dorepalli Chanti… pic.twitter.com/mLQLVuTw3G— Cyberabad Police (@cyberabadpolice) April 20, 2026 -
శృతిహాసన్పై పబ్లిక్‌లో కామెంట్స్.. నటి ఆగ్రహం..!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న శృతిని రోడ్డుపై ఉన్న కొందరు కామెంట్స్ చేశారు. శృతిని చూసి మమ్మ అంటూ పబ్లిక్‌లో గట్టిగా అరిచారు. ఇది విన్న శృతి హాసన్ 'కౌన్ హై మమ్మ.. హమ్ నే మమ్మ హై.. ఏ మాట్లాడుతున్నారు మీరు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ బండి ఎక్కడ ఉంది అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. అడివి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా రజినీకాంత్ కూలీ చిత్రంలో కనిపించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే శృతి హాసన్‌కు రెండుసార్లు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. Kamal Haasan's daughter Shruti Haasan was heading to a party when someone called her “mumma.” She got angry and replied brutally 😭 pic.twitter.com/mi8rJfKVGe— Sunita Indian (@NationSpeax4j) April 19, 2026 -
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
మెగాస్టార్ నటించిన సినిమాల్లో క్లాసిక్ హిట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఆపద్బాంధవుడు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. 1992లో విడుదదలైన ఈ క్లాసిక్ సూపర్ హిట్ మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్గా మీనాక్షి శేషాద్రి కనిపించింది. ఈ మూవీ రిలీజై నేటికి 34 ఏళ్లవుతోంది. అప్పట్లో ఈ చిత్రంలో ఓ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అవురా అమ్మకు చెల్లా అంటూ సాగే పాట సినీ ప్రియులను అలరించింది. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆ సాంగ్ అభిమానులను మెప్పించింది.దాదాపు 34 ఏళ్ల తర్వాత హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా అవురా అమ్మకు చెల్లా పాటకు స్టెప్పులను రీ క్రియేటే చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె ఈ పాటకు చిందేశారు. 62 ఏళ్ల వయసులోనూ అదే స్టెప్పులతో అదరగొట్టారు. ఆమె డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీనాక్షి శేషాద్రి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా తెలుగు సినిమా 'ఆపద్భాంధవుడు'లోని ఈ అందమైన పాటను ఉగాది ఇన్‌స్టాలో పోస్ట్ చేద్దామనుకున్నా. కానీ కొంచెం ఆలస్యమైంది. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీ అందరి కోసం ఈ సాంగ్ తీసుకొచ్చా. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో.. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని పూడపల్లి అనే మారుమూల గ్రామంలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ పాటను కులు మనాలిలోని పచ్చని ప్రకృతిలో షూట్ చేశారు. డల్లాస్‌లోని నా బృందానికి ధన్యవాదాలు. ఈ మొత్తం లుక్‌ను రూపొందించడం చాలా సరదాగా అనిపించింది.' అని పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Meenakshi Seshadri (@iammeenakshiseshadri) -
హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. కోటి రూపాయల పరిహారం కోరుతూ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతోనే తమన్నా పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీకి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. అసలేం జరిగిందంటే..పవర్ సోప్స్ అనే సంస్థతో 2008లో తమన్నా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే తమన్నాతో పవర్ సోప్స్‌కు అగ్రిమెంట్ కుదిరింది. కానీ గడువు ముగిసినా 2010, 2011లో కూడా ఆ సంస్థ తన ఉత్పత్తులతో పాటు ప్రకటనల్లో మిల్కీ బ్యూటీ ఫోటోలను వినియోగించింది. దీంతో ఒప్పందం అయిపోయినా కూడా తన ఫోటోలను ప్రకటనల్లో వాడారని ఆరోపిస్తూ తమన్నా ఇటీవలే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తమన్నా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నా పిటిషన్‌ను హైకోర్ట్ తిరస్కరించింది. -
నేను ఏ తప్పు చేయలేదు.. చేయను కూడా..: సింగర్ మంగ్లీ
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.మధునాయక్‌ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్‌లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్‌లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)
-
'అలా అయితేనే ఒప్పుకుంటా': అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్గా వస్తోన్న మూవీ "లీసా". సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..' నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటా. డిఫరెంట్‌గా ఉంటేనే ఆ మూవీని ఒప్పుకుంటా. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా కొత్తదనాన్ని ఫీలయ్యా. హీరోయిన్స్‌గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ..' లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్‌లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్‌కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య ఫర్మామెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, దశరథ్, కిషోర్ దాస్, రవిరెడ్డి , సత్యశ్రీ, మాసం రత్నాకర్ రెడ్డి, హను శ్రీ, గీత, భాను కీలక పాత్రల్లో నటించారు. -
విష్ణు ప్రియ వివాదం.. మొహం చాటేసిన యాంకర్..!
టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై . ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించేందుకు యత్నించగా మొహం చాటేసుకున్నారు. మీరు ఎంత డబ్బులు సంపాదించారని కొందరు ఆమెను అడిగారు. దీంతో తన చేతులను మొహానికి అడ్డుగా పెట్టుకుని.. మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే?..ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్‌స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Anchor :- #VishnuPriya గారిని ఎంత డబ్బులు సంపాదించారు#VishnuPriya : “Mummy” pic.twitter.com/zo5rP9h3w4— Milagro Movies (@MilagroMovies) April 13, 2026 -
మాల్దీవుస్‌లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్‌లో బిగ్‌బాస్ దివి చిల్..!
మాల్దీవుస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్‌లో చిల్ అవుతోన్న బిగ్‌బాస్ దివి..జిమ్‌లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ యాంకర్‌గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్‌లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను అనసూయ తన ట్విటర్లో షేర్ చేసింది. హమ్ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్‌కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. Hmmmm…. pic.twitter.com/NlOfnWbt8l— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 9, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్‌లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026 -
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
'చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా'.. రష్మిక ట్వీట్ వైరల్
ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్ రిలేషన్లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్‌తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్‌ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్.. కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్‌లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. My 30th birthday was kinda different this time. ❤️Went back home after a while. Went to the temple I’ve grown up going to.. ❤️Went to my school and saw it from outside (because of time constraints 🐒🙈) and revisited childhood for a quick bit.. ❤️Cut the cake amongst the… pic.twitter.com/5ZGxuBpUAD— Rashmika Mandanna (@iamRashmika) April 9, 2026 -
హన్సిక మాజీ వదినకు షాక్.. ఏకంగా రూ.2 కోట్లకు..!
దేశముదురు చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ నటించిన ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగానే 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం పటాపంచలైంది. ఈ ఏడాది మార్చి 11న ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఆ తర్వాత హన్సిక తీరుపై మాజీ వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్ విమర్శలు చేసింది. హన్సిక విడాకులను ఉద్దేశించి అంతా ఫేక్ ప్రపంచం అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. వాస్తవానికి హన్సికకు, ముస్కాన్‌కు గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.తాజాగా హన్సిక మాజీ వదినపై పరువునష్టం దావా వేసింది. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తోందని ముస్కాన్‌పై రూ.2 కోట్లకు పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ముస్కాన్.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ చేయకూడదని ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు సూచించింది. ఇటీవలే విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ టాపిక్ కాస్తా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.సినిమా కెరీర్.. హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. -
తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..!
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. -
ఈ సినిమా ఎంతో స్పెషల్ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
ఎల్లో డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్‌లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్‌లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఛాన్స్.!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా టాలీవుడ్లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. -
'నేనేం పాపం చేశా.. ఇలా తిట్టడం మంచిది కాదు..'రేణు దేశాయ్
సినీ నటి రేణు దేశాయ్ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రేణు దేశాయ్‌ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.సోషల్‌మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
దేవరకొండతో పెళ్లి తర్వాత తొలి బర్త్ డే.. సెలబ్రేషన్స్ చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్‌గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్‌తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. Surrounded by love & powered by happiness!🫶#RashmikaMandanna celebrates her birthday the sweetest way!❤️#VijayDeverakonda #VIROSH #TeluguFilmNagar pic.twitter.com/MA5BseCsce— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2026 -
'మీ హేమక్క ఎప్పుడు అలా చేయదు'.. వీడియో రిలీజ్
టాలీవుడ్ నటి హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ప్రెస్ మీట్లోనూ తనకు పాజిటివ్ రాకుండానే.. వచ్చిందని రాసుకొచ్చారని తన బాధను పంచుకుంది.తాజాగా నటి హేమ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ప్రస్తుతం కొండాపూర్‌లోని పబ్‌కి వచ్చానని తెలిపింది. పోలీసుల రైడ్‌లో కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అక్కడే ఉన్న నన్ను కూడా టెస్ట్ చేశారని.. కానీ నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రేపు మళ్లీ ఈ వీడియోను పోస్ట్ చేస్తాను.. మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదు.. జెన్యూన్‌గా ఉంటుంది.. ముక్కుసూటిగా ఉంటది.. లవ్ యూ ఆల్' అంటూ వీడియోలో మాట్లాడారు హేమ.HYD కొండాపూర్‌లోని క్వాక్ ఎరీనా పబ్‌పై పోలీసుల రైడ్‌లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది అని చెబుతున్నారు.అక్కడ ఉన్న తనకు టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చిందని నటి హేమ వీడియో విడుదల చేశారు. హేమ ఎప్పుడు తప్పు చేయదు జెన్యూన్ గా ఉంటుంది..ముక్కు సూటిగా మాట్లాడుతుంది ..అని అన్నారు నటి హేమ… pic.twitter.com/gzH3Y6EhQn— Tupaki (@tupaki_official) April 3, 2026 -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్..!
ఎల్లో డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
సమంత మెచ్చిన ఇన్‌స్టా రీల్.. ఆమె టాలెంట్‌కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్‌స్టా రీల్స్‌లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్‌స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్‌ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె హీరోయిన్‌తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై రాకాస అనే మూవీని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్‌ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. -
ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత ఆమెను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వహించా ఈ సందర్భంగా ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా మానసికంగా కలచివేశాయని తెలిపింది. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు అంతలా నన్ను మానసికంగా కుంగిదీసిందని వెల్లడించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేసింది. నాపై వచ్చిన తప్పుడు వార్తల వల్ల తన కుటుంబం చాలా బాధపడిందన్నారు.మీట్ ది ప్రెస్‌లో హేమ మాట్లాడుతూ....'డ్రగ్స్ కేసులో కొందరు తనపై నిరాధార ఆరోపణలు చేశారు. వాటితో తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ఆ సమయంలో చాలా సఫర్ అయ్యా. అది నాకు చాలా కఠినమైన కాలం. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలనిపించింది' అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. -
ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనిపిస్తోంది.. హేమ ఆవేదన
టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తన గురించి తెలిసి కూడా అలా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో తనకు పాజిటివ్ అని రాకుండానే.. వచ్చిందని ప్రచారం చేశారని ఆరోపించింది. ఇదంతూ చూస్తుంటే ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగానని.. నేను మీ అందరికీ తెలుసు కదా అని ప్రశ్నించింది. నాకు కూడా ఫ్యామిలీ ఉందని.. మా బాధలు అర్థం చేసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఏదైనా నిర్ధారణ అయ్యాకే రాయాలని హేమ సూచించింది. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరని అన్నారు. సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. మరి అదే కేసును కోర్టు కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని తెలిపింది. -
బిగ్‌బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్‌బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్‌లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
'ఆయనను గురువులా భావిస్తా'.. సైన్ లాంగ్వేజ్‌లో అభినయ స్పీచ్ వైరల్
టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది. ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది. సైన్ లాంగ్వేజ్ లో నటి అభినయ స్పీచ్...నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని గారుసముద్రఖని గారు మంచి దర్శకులు అలాగే అంతకు మించి మంచి నటుడు: అభినయ#Abhinaya #CarmeniSelvam #Samuthirakani pic.twitter.com/lukFHtLVFJ— Filmy Focus (@FilmyFocus) March 26, 2026 -
షార్ట్ ఫిల్మ్‌తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి వైఎస్ మాధవ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడిమోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. View this post on Instagram A post shared by DRISHIKA CHANDER (@drishikachander) -
మాల్దీవుస్‌లో మాళవిక రాజ్ చిల్.. బిగ్ బాస్ దివి స్టన్నింగ్ పోజులు
కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ పోజులు..మాల్దీవుస్‌లో మాళవిక రాజ్ చిల్..బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక.. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. Apple...Watching you blossom into such a beautiful young girl fills my heart with a joy I can’t even put into words. You are the very embodiment of kindness, gentleness, warmth, laughter, loyalty, and that effortless spark of sass that makes you you.Every moment of watching… pic.twitter.com/smHR7J6HZ8— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 24, 2026 -
స్విమ్ షూట్లో హీరోయిన్ అనితా.. సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ చిల్..!
వైట్ బ్యూటీలా మెరిసిపోతున్న ది రాజాసాబ్ బ్యూటీ..సముద్రంలో జలకాలాడుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్...ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..స్విమ్ షూట్లో మెరిసిన హీరోయిన్ అనితా.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
సంయుక్త మీనన్ గ్లామరస్ పిక్స్.. మాల్దీవుస్‌లో ప్రగ్యా జైస్వాల్..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్స్..బాలిలో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..రెడ్ డ్రెస్‌లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ అందాలు..శారీలో దిల్ రాజు సతీమణి తేజస్విని పోజులు..మాల్దీవుస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
అనసూయ ఉగాది వైబ్స్..థాయ్‌లాండ్ వేకేషన్లో అభినయ..!
టాలీవుడ్ నటి అనసూయ ఉగాది వైబ్స్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉగాది లుక్..బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఉగాది పోజులు..టాలీవుడ్ నటి హంసానందని ఉగాది సెలబ్రేషన్స్..థాయ్‌లాండ్ వేకేషన్లో టాలీవుడ్ నటి అభినయ.. View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కర్లింగ్ హెయిర్‌తో బిగ్‌బాస్ దివి..ఆరెంజ్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి..!
కర్లింగ్ హెయిర్‌తో బిగ్‌బాస్ బ్యూటీ దివి..రెస్టారెంట్లో ఆరగిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రా..ఆరెంజ్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి హోయలు..కల్లు తాగుతూ చిల్ అవుతోన్న హేమ, సురేఖావాణి..బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by @natasastankovic__ -
కల్లు తాగుతూ టాలీవుడ్ తారల చిల్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ, సురేఖవాణి ముందువరుసలో ఉంటారు. పలు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఎప్పుడు సినిమా వర్క్ లైఫ్‌లో బిజీగా ఉండే వీరిద్దరు సమ్మర్లో చిల్ అవుతూ కనిపించారు.తాజాగా ఓ గ్రామానికి వెళ్లిన హేమ, సురేఖవాణి ఫుల్‌గా చిల్ అయ్యారు. ఈత చెట్టు నుంచి కల్లు తీస్తూ కనిపించారు. ఇద్దరు కలిసి సరదాగా కల్లు తాగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
పెళ్లి పీటలెక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
అరుంధతి మూవీతో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. ఆ తర్వాత బాహుబలి మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే అప్పుడప్పుడు వీరిద్దరిపై పెళ్లి రూమర్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ బోలెడు కథనాలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి.తాజాగా ఈ స్వీటీ అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనుందని సమాచారం. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అబ్బాయి కన్నడ కుటుంబానికి చెందినవారని.. వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఘాటీ మూవీతో అభిమానులను మెప్పించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తున్నారు. -
'ఎవరికైనా అమ్మాయే టార్గెట్.. తన బాధ ఎవరికీ పట్టదు'.. రీతూ చౌదరి షాకింగ్ పోస్ట్
బిగ్‌బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. గతేడాది బిగ్‌బాస్ సీజన్లో మెరిసింది. అయితే ఈ సీజన్లో మరో కంటెస్టెంట్ డీమాన్ పవన్‌తో కాస్తా సన్నిహితంగా మెలగడంతో డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు. తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అమ్మాయిల జీవితం ఇంతేనంటూ తన లైఫ్‌లో జరిగిన బాధను వ్యక్తం చేసింది.ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్న రీతూ.. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ అనే ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. తాజాగా అమ్మాయిల లైఫ్ గురించి పోస్ట్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.రీతూ చౌదరి తన స్టోరీలో రాస్తూ.. "ఈ సమాజం అమ్మాయిలను సులభంగా జడ్జ్ చేస్తారు. ఆమెకు గతంలో ఏం జరిగిందో ఎవరూ అడగరు. తన ప్రేమ, కేరింగ్, నిజాయతీ గురించి ఎవరికీ అక్కర్లేదు. కానీ చివరకు మోసపోయేది ఒక అమ్మాయే. రిలేషన్ షిప్ బ్రేకప్, డిప్రెషన్లో ఉన్న తన ఫ్యామిలీ కోసం, కెరీర్ కోసం నవ్వుతూ ఉంటుుంది. కానీ సమాజం తన బాధని చూడదు. అందరూ రూమర్స్, ఆరోపణలే చూస్తారు. నిజం ఏంటో తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ తను అమాయకురాలు అయితే ఎందుకు సైలెంట్‌గా ఉంది అంటారు' అని ఆవేదన వ్యక్తం చేసింది.'ఒక అమ్మాయి హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి ముందుకు వెళ్లిపోతాడు. అతను చాలా ఈజీగా మరో అమ్మాయితో వెళ్లిపోతాడు. అన్ని తెలిసినా కూడా సైలెంట్‌గానే ఉంటుంది ఆ అమ్మాయి. కొన్ని సందర్భాల్లో స్నేహం కూడా ఆయధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేస్తుంది. సమాజం ముందు బ్యాడ్ చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని నాశనం చేస్తుందని తెలిసినా కూడా ఆ అమ్మాయి సైలెంట్‌గానే ఉంటుంది. అది తన బలహీనత కాదు..అదంతా తన కర్మ అని.. దేవుడిని నమ్ముతుంది. తన గురించి నిజాలు తెలియని ఈ సమాజం జడ్జ్ చేస్తున్నా కూడా సైలెంట్ ఆ బాధని భరిస్తుంది' అంటూ తన స్టోరీలో రాసుకొచ్చింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రీతూ చెప్పింది అంతా తన గురించేనా? అని చర్చించుకుంటున్నారు. అసలు ఆ అబ్బాయి ఎవరు? తనని నెగిటివ్ చేసిన అమ్మాయి ఎవరు? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్టోరీ తనదేనా లేదంటే తన ఫ్రెండ్ గురించేనా? అనేది తెలియాలంటే రీతూ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!
ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్దిన్ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్ దిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్‌లాండ్ భాషలో రూపొందిన ఒన్ డే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైద్‌ఖాన్ హీరోగా నటించారు.జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్దిన్ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్ఖాన్లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్‌లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
'నా జుట్టు రంగు ఇంకా మారలేదు'.. హల్దీ వేడుకపై రష్మిక పోస్ట్
రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న ఈ వివాహా వేడుకలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారు. వీరిద్దరి వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లి తర్వాత అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.పెళ్లి తర్వాత రష్మిక తాజాగా మరో పోస్ట్ చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హల్దీ ప్లస్ హోలీ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో మేము ఎంతగా తడిసిపోయామో.. ఇప్పటికీ నా జుట్టు రంగు ఇంకా ఎర్రటి రంగులోనే ఉందన్నారు. ఇంతటి మధురమైన క్షణాల వేళ.. నా బ్రైడ్ టీమ్‌తో కలిసి ఆ రోజు అన్ని ఆటలను గెలిచానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే విజ్జూ కూడా ఆ రోజు టీమ్ బ్రైడ్ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న తాజా నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నమో రే నమోరే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించగా.. జునైద్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరిఆలపించారు. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన నమో రే పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ ఆధ్యాత్మిక పాటకు వెయ్యి మంది డ్యాన్సర్స్ పాల్గొనగా.. భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. -
బ్లాక్ డ్రెస్‌లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
'ఆ డైరెక్టర్ తీరు నచ్చలేదు.. నాపై తప్పుడు ప్రచారం'.. లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్ చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ తమిళ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో దర్శకుడి తీరుతో చాలా అసౌకర్యానికి గురయ్యానని వివరించింది. అందువల్లే ఆ సినిమాకు నేను నో చెప్పేశానని లావణ్య త్రిపాఠి పేర్కొంది.ఆ సమయంలో నాకు ఎవరూ కూడా సపోర్ట్ కూడా లేదని లావణ్య తెలిపింది. ఆ తర్వాత నన్ను టార్గెట్‌గా చేసి వేధించారని అన్నారు. నాపై కేసు పెట్టడమే కాకుండా.. తప్పుడు కథనాలు కూడా రాసుకొచ్చారని ఆవేదన వ్యక్తం తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని లావణ్య త్రిపాఠి వివరించింది.లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..'ఒకప్పుడు నేను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడి తీరు నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు అక్కడ సౌకర్యంగా లేదని అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో అని చెప్పా. ఆ తర్వాత వారు నా గురించి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలుపెట్టారు' అని చెప్పుకొచ్చింది. “There was a time when I was supposed to do a Tamil film, but I felt something was not right with the DIRECTOR and I didn't feel Comfortable, so I said NO.After that, they were started putting wrong articles about me in newspaper."– Actress #LavanyaTripathi | #Kollywood pic.twitter.com/QvEZ39watH— Whynot Cinemas (@whynotcinemass_) March 14, 2026 -
భాగ్యనగరంలో భలే జోరు
వేసవి మొదలైపోయింది. ఎండలు కూడా అప్పుడే మండుతున్నాయ్. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్‌లతో బిబీ బిజీగా ఉంటున్నారు నటీనటులు. కొన్ని సినిమాలు ఇండోర్‌లో (స్టూడియోల్లో) షూటింగ్స్ జరుపుకుంటుండగా... మరికొన్ని మూవీస్ షూటింగ్స్ కోసం హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి చిత్రీకరణలు జరుపుతున్నారు మేకర్స్.ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...మూసరంబాగ్లో... నాగార్జున కెరీర్లో వందో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కర్నాటకలోని మైసూర్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని మూసరాంబాగ్లో జరుగుతోంది. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సీనియర్ నటి టబు–నాగార్జున కలిసి నటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని టాక్. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (గెస్ట్ అప్పీయరెన్స్) కలిసి ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న ఈ వందో చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గట్టు అద్భుతమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలిసింది. ‘కేజీఎఫ్’ మూవీ ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘యానిమల్’ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. శంకర్‌పల్లిలో ఇరుముడి... వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంకర్‌పల్లిలో జరుపుకుంటోంది.ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారట. ‘‘రవితేజ మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రని ‘ఇరుముడి’లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారట. ఆయనపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగకి ‘ఫౌజీ’ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శంకర్‌పల్లిలో కల్కి... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది.‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ పాత్ర చేసిన కమల్‌హాసన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తొలి భాగంలో అమితాబ్, కమల్‌కి ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ, ‘కల్కి 2898 ఏడీ 2’లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా కీలకం అట. ఈ నేపథ్యంలోనే శంకర్‌పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం అమితాబ్, కమల్ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అజీజ్ నగర్లో... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రెండు చోట్ల జరుగుతోంది.హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్ నగర్లో, అదే విధంగా గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు యూనిట్లతో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అజీజ్ నగర్లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలోని ముఖ్య తారాగణంపైనా పలు సీన్స్ తీస్తున్నారట. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి వాయిదా పడి ఏప్రిల్ 30కి ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంగీతం: ఏఆర్ రెహమాన్. ముచ్చింతల్‌లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో నానీతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే మాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. ఫైనల్‌గా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. అజీజ్ నగర్లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 33’ (వర్కింగ్ టైటిల్). సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకస్తున్నారట. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘గోపీచంద్ 33’.ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ అద్భుతంగా నటిస్తున్నారు. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణలో లెనిన్... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది.అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు చిత్రంలోని ప్రధాన తారగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మురళీ కిశోర్. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం పొడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘లెనిన్’ ఈ వేసవిలో విడుదల కానుంది. ముచ్చింతల్‌లో భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట సంపత్ నంది.ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘భారీ పాన్–ఇండియన్ పీరియాడిక్ మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. తుక్కుగూడలో... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో సాయిదుర్గా తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు రోహిత్. ఈ సినిమా 2025 సెప్టెంబరు 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు. పైన పేర్కొన్నటువంటి సినిమాలే కాదు. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఇంతలా భావోద్వేగానికి ఎప్పుడు గురికాలేదు: రష్మిక
ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లాడిన హీరోయిన్ రష్మిక తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు స్పందించింది. విజయ్- రష్మిక ప్రేమ, పెళ్లి, వాళ్లద్దరి ప్రయాణం గురించి ఓ కథనం రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక ఆ ఆర్టికల్‌కు రిప్లై ఇచ్చారు. చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంతగా భావోద్వేగానికి గురి కాలేదని తెలిపింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' చాలా కాలంగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది.. కానీ మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నా. నా ప్రయాణం గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒక్కటే. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతకండి' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. I have never become so emotional reading something written about me this much in a long long time.. There is so much I want to say but so little I can say. I am finding my own room and that’s a journey I am so grateful for.. Thankyou for recognising it..❤️About love all I… https://t.co/f7W5vv0UJ5— Rashmika Mandanna (@iamRashmika) March 8, 2026 -
ముక్కలైనా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. టాలీవుడ్ నటి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ అభిమానులను అలరించిన నటీమణుల్లో హంసానందిని ఒకరు. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. 'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.తాజాగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన జీవితం ముక్కలైనా.. మళ్లీ నిర్మించుకున్నానని తెలిపింది. క్యాన్సర్‌తో పోరాడి తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకున్న ప్రయాణం గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తన లైఫ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను తలచుకుని ఎమోషనలైంది.క్యాన్సర్ బారిన పడి..అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ తర్వాత 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే?
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు.అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్స్ అవార్డ్స్‌లో తన భార్య రష్మికకు ఉత్తమ నటిగా ఎంపికైంది. ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు అవార్డ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక భర్త పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. విజ్జు.. నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి ఒకరినొకరు అభినందించుకోవడం విశేషం. -
మీ దగ్గర ఆధారాలున్నాయా?.. నెటిజన్‌కు రష్మీ స్ట్రాంగ్ కౌంటర్
టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. తన క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నీ వద్ద ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టాలని అతనికి గడ్డిపెట్టింది. నాకు రిలేషన్స్ ఉన్నా.. లేకపోయినా.. నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదని మండిపడింది. ఒక వేళ నేను పెళ్లి చేసుకునే వరకు ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదంటూ హితవు పలికింది. మహిళ దినోత్సవం రోజే యాంకర్ రష్మి వేధింపులకు గురికావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.రష్మీ గౌతమ్ తన ట్వీట్లో రాస్తూ..'ముందు రుజువులు చూపించు. రెండోది.. నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా.. నాపై వేధింపులు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు ఎంతమందితో తీరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరితో లింక్ ఉందో దయచేసి వాలా పేర్లు ప్రూఫ్‌తో సహా చెప్పండి. నా ఒక్క పేరు ఎందుకు. మీరు ఎవరి క్యారెక్టర్‌నైనా కించపరచాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి. అది న్యాయం' నెటిజన్‌కు ఫుల్‌గా గడ్డిపెట్టేసింది.First and foremost show the proofSecondly no matter how many relationships I have or not No one has the right to abuse me And until and unless I’m getting married to you or or your father or your son Neenu yetha mandi tho teerigina aadi mee problem kadu Also naku yevari… https://t.co/RPYQ8fZj50— rashmi gautam (@rashmigautam27) March 8, 2026 -
ఒక్క రోజు స్ట్రాంగ్ ఏంటి?.. ఇప్పటికే ఉన్నారు: అనసూయ స్పెషల్ వీడియో
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి అనసూయ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారని చాలామంది అడుగుతున్నారని తెలిపింది. ఈ ఒక్క రోజు కాదు మాత్రమే కాదు.. ప్రతి రోజు మహిళలదే అని అన్నారు. అయితే ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడతారని తెలిపారు. పురుషులు కూడా మహిళలను ఇబ్బంది పెట్టకుండా.. వారికి అండగా నిలిచి వారితో పాటు మీరు ఎదగాలని అనసూయ హితవు పలికారు.స్ట్రాంగ్ ఉమెన్ ఇప్పటికే చాలామంది ఉన్నారని అనసూయ అన్నారు. ఈ ఒక్క రోజు ఉమెన్ స్ట్రాంగ్ కావాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాగా.. మహిళల విషయంలో అనసూయ ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. గతంలో శివాజీ మహిళల దుస్తులపై కామెంట్స్ చేయడంతో అనసూయ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆ తర్వాత శివాజీ సైతం తన మాటలపై క్షమాపణలు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ గతేడాది అరి మూవీతో ప్రేక్షకులను అలరించారు. 💪🏻🙌🏻❤️✨#8thOfMarch2026 pic.twitter.com/fcWeoaIYwc— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2026 -
నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
-
ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ గ్లామర్.. కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఆషిక రంగనాథ్ అందాలు..!
మరింత గ్లామరస్‌గా ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్..దేవకన్యను మరిపిస్తోన్న హీరోయిన్ ఆషిక రంగనాథ్..హీరోయిన్ అమలాపాల్ హోలీ సెలబ్రేషన్స్..బిగ్‌బాస్ దివి హోలీ సెలబ్రేషన్స్..ధగధగ మెరిసిపోతున్న రానా సతీమణి మిహికా.. View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ఖుషీ కపూర్ బోల్డ్ లుక్.. మాల్దీవుస్‌లో బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..!
బోల్డ్ లుక్‌లో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్..బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ పిక్స్..మాల్దీవుస్‌లో ఎంజాయ్ చేస్తోన్న బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..గిటార్ వాయిస్తోన్న స్వయంభు బ్యూటీ సంయుక్త మీనన్..శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ రంభ.. View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ramya moksha kancharla (@ramya_moksha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్‌గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్‌గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్‌తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్‌ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్‌కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్‌ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్‌స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్‌కు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్‌కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.'ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు'.. శివాజీకి అర్జున్ రెడ్డి నటి కౌంటర్..!
హీరోయిన్స్ దుస్తులను ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదం సృష్టించాయి. ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ సంఘటన తర్వాత ఓ మూవీ ఈవెంట్లో శివాజీ మాట్లాడారు. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో రెండు పదాలు వాడారు. అప్పట్లో ఈ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా శివాజీ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ నటి అదితి మైకల్ స్పందించింది. శివాజీ సినిమాలు చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని అని తెలిపింది. ఒక అమ్మాయి డ్రెస్ గురించి మీరు మాట్లాడుతుంటే భయమేస్తోందని వెల్లడించింది. అప్పుడు మీ సినిమాల్లో హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు.. అప్పుడు మీరెందుకు చెప్పలేదని శివాజీని ప్రశ్నించింది. అప్పుడు మనకెందుకని.. మీరు మీ పని చేసుకుని వెళ్లిపోయారు కదా.. అప్పుడు వాళ్లను ఎందుకు ఆపలేదని నిలదీసింది.ఇలాంటి దుస్తులు వేసుకోవడం నాకిష్టమని.. ఇదే నాకు ఫుడ్ పెడుతోందని అదితి తెలిపింది. అలాగని నేను బికినీ వేసుకుని రోడ్డుమీదకి వెళ్లట్లేదు కదా అని పేర్కొంది. ఒకసారి నేను అమీ తుమీ ప్రమోషన్స్‌కు బస్సులో వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి ఏకంగా నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడని వెల్లడించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ అమ్మాయిల రుద్దడం ఆపేయండని శివాజీకి అదితి కౌంటరిచ్చింది. మేము ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. కొందరైతే మీ లో దుస్తులు బయటికి కనిపిస్తున్నాయని సరిగా వేసుకోండని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదితి మ్యాకల్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో మరోసారి చర్చకు దారితీశాయి. కాగా.. అదితి.. టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత అమీ తుమీ, ఏకం, 24 కిస్సెస్, రాధ, షాదీ ముబారక్ లాంటి చిత్రాల్లో నటించింది. మొదట వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన అదితి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. “మీ మూవీస్‌లోనే హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు. అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు..నాకు ఇష్టం ఇలాంటి బట్టలు వేసుకోవడం.. నాకు FOOD పెడుతోంది.. అలా అని నేను BIKINI రోడ్ మీద వేసుకొని వెళ్లట్లేదు కదా.”- Aditi Myakal to Actor #Sivaji pic.twitter.com/t9lnKwO5LP— Whynot Cinemas (@whynotcinemass_) February 26, 2026 -
బిగ్‌బాస్ బ్యూటీ దివి షాపింగ్.. శారీలో నివేదా థామస్ అందాలు..!
చార్మినార్ షాపింగ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి..బ్లూ డ్రెస్‌లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్..బ్లాక్ శారీలో నివేదా థామస్ హోయలు...డిఫరెంట్ డ్రెస్సులతో బాలీవుడ్ భామ దిశాపటానీ..రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అలా నటించటం తప్పేమీ కాదు : కాజల్
సీనియర్ హీరోయిన్లు తమ ఉనికిని చాటుకోవడానికి చాలా పాట్లు పడుతున్నారనే చెప్పాలి. ఇంతకుముందు వరకు భారతీయ సినిమాలో అగ్ర కథానాయకులుగా రాణించిన కొందరు హీరోయిన్లు పెళ్లై పిల్లలు కలిగినా సినిమాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇంకా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో తమ అందాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అందమైన ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ప్రచారంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు తమిళం హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య పెళ్లి కూడా చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యారు. అయినప్పటికీ నటనకు దూరం కావడానికి ఇష్టపడడం లేదు. దీంతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అందాలను ప్రదర్శించే విధంగా సిద్ధమై వస్తున్నారు.తనను చూసి సీనియర్ నటి అని ఎవరు భావించరాదని ఉద్దేశంతో జూనియర్ నటీమణులకు పోటీగా పొట్టి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. అంతేకాకుండా ఈ భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లామర్ అనేది నటనలో ఒక భాగమేనని అన్నారు. అలా నటించటం తప్పేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వివాహం అనేది నటిమణుల పయనానికి అడ్డు కాదని అన్నారు. ఈమె వ్యాఖ్యలు తన సహ నటీమణులను ఆలోచనల్లో పడేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
హీరోయిన్ ఎవరు?
టాలీవుడ్లో ప్రజెంట్ కథనాయికల కోసం సెర్చ్ జరుగుతోంది. అనౌన్స్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ కథానాయకుల సరసన నటించే కథానాయికలు ఎవరు? అనే విషయాలపై స్పష్టత రావడం లేదు. కానీ ఫలానా హీరో సినిమాలో ఫలానా హీరోయిన్ ‘ఇన్’ అయ్యారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్ వేయండి.తండ్రీ కూతుళ్ల అనుబంధం అన్నదమ్ముల అనుబంధం కథాంశంగా చిరంజీవి హీరోగా నటించి, బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 2023 సంక్రాంతికి విడుదలై, హిట్‌గా నిలిచింది. మళ్లీ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఓ సినిమా రానుంది. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. మార్చి మొదటి వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ ఏడాది మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా షూట్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు బాబీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారట బాబీ. ఈ సినిమా కథాంశం ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రియమణిని ఎంపిక చేశారట మేకర్స్. అలాగే చిరంజీవి కుమార్తె పాత్ర కోసం సారా అర్జున్, కృతీశెట్టి, అనస్వరా రాజన్, ప్రీతీ ముకుందన్ వంటి యువ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రీతీ ముకుందన్ ముందు వరసలో ఉన్నారట. మరి... ఈ చిత్రంలో చిరంజీవి భార్యామణిగా ప్రియమణి, ఆయన కుమార్తెగా ప్రీతీ ముకుందన్ పేర్లు ఖరారు అవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.నాలుగోసారి... ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. బాలకృష్ణ కెరీర్‌లోని 111వ సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ఓ భారీ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ కథ అనుకున్నారు. ఇందులో నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ హిస్టారికల్ కథను కాస్త పక్కన పెట్టి, ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమా కథను ఫైనలైజ్ చేశారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మాత్రం నయనతారనే ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి చిత్రాల తర్వాత బాలకృష్ణ–నయనతార జోడీ నాలుగోసారి రిపీట్ అవుతుందా? వేచి చూడాలి.వెంకీ సరసన కీర్తి ?సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో అనిల్ రావిపూడి చేసిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్ జోష్‌లో తన తర్వాతి సినిమా రిలీజ్‌ను సంక్రాంతికే ఫిక్స్ చేశారు అనిల్ రావిపూడి. వరుస హిట్స్ సాధిస్తుండటంతో అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాల తర్వాత వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి మరో సినిమా చేయనున్నారని, ఈ సినిమాయే 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘బామ్మర్ది బాల్‌రెడ్డి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు ఈ చిత్రంలో కీర్తీ సురేష్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించనున్నారనే టాక్ వినిపించింది. మరి... వెంకటేశ్ సరసన కీర్తీ సురేష్ తొలిసారి హీరోయిన్గా కనిపిస్తారా? వేచి చూడాలి. దీపిక ప్లేస్‌లో సాయి పల్లవి? హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూ పోందుతున్న సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 జూన్ 27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ‘కల్కి 2’ (కల్కి 2898 ఏడీ 2) సినిమా రానుంది.ఈ మూవీ చిత్రీకరణ మొదలైంది. అమితాబ్ బచ్చన్–కమల్ హాసన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల ప్రభాస్ కూడా ఈ షూట్లో పాల్గొంటారు. అయితే దీపికా పదుకోన్ మాత్రం ఇక ఈ ‘కల్కి2898 ఏడీ’ సినిమా ఫ్రాంచైజీలో కనిపించరు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపిక నటించడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘కల్కి2898 ఏడీ’ సినిమాలో దీపిక పోషించిన సుమతి పాత్రను ఎవరు చేస్తారనే చర్చ టాలీవుడ్లో జరుగుతోంది. దీపిక ప్లేస్‌లో సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని టాక్.రామ్‌చరణ్‌కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సుకుమార్ అండ్ టీమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కథ గురించి హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ మూవీ ప్రీప్రోడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో నటించనున్నారంటూ సమంత, రష్మికా మందన్నా వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి.తాజాగా హీరోయిన్ కృతీ సనన్ పేరు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్ బాబు ‘వన్: నేనొక్కడినే’ తో తెలుగుకి పరిచయం అయిన కృతీ సనన్, ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో నటించారు. మరి... రామ్‌చరణ్ సరసన కూడా ఈ బ్యూటీ కనిపిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.రోమియో కోసం యానిమల్ బ్యూటీ నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో రానున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘బ్లడీ రోమియో’. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నానీతో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో ఇంకా ఎవరూ అఫీషియల్‌గా కన్ఫార్మ్ కాలేదు. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు ఇటీవల వినిపించాయి. కానీ తాజాగా ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి పేరు తెరపైకి వచ్చింది. ‘బ్లడీ రోమియో’ టీమ్ త్రిప్తితో సంప్రదింపులు జరుపుతోందని, ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా కన్ఫార్మ్ కావొచ్చని తెలిసింది. నాని–త్రిప్తి జోడీగా ఇప్పటివరకు కలిసి నటించలేదనే విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్’ సినిమా చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఈ సినిమా రూ పోందుతోంది. మోహన్‌బాబు, సంపూర్ణేష్‌బాబు, రాఘవ్ జూయల్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటిస్తున్నారని తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.శర్వా సరసన.. ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారీ’తో సూపర్‌హిట్ అందుకున్నారు శర్వానంద్. ప్రస్తుతం ‘భోగి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు శర్వా. అలాగే దర్శకుడు శ్రీను వైట్లతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు శర్వా. ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా సక్సెస్ మీట్లో ఈ సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు ఆషికా రంగనాథ్‌ను ఎంపిక చేశారట మేకర్స్. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.గ్రీన్ సిగ్నల్? హీరోగా కార్తీ తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మించనున్నారట. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు కల్యాణ్ శంకర్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని రెడీ చేశారట. ఈ కథ కార్తీకి నచ్చిందని, దీంతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ మీనాక్షీ చౌదరిని సంప్రదించారని భోగట్టా. సితార సంస్థ నుంచి వచ్చిన ‘లక్కీ భాస్కర్, అనగనగ ఒకరాజు’ వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు మీనాక్షీ చౌదరి. ఇప్పుడు ఈ సంస్థ కార్తీతో నిర్మించాలనుకుంటున్న సినిమాలో మీనాక్షి భాగమవుతారా? వేచి చూడాల్సిందే. ఇలా ఫలానా హీరో సినిమాలో ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తల్లో ఉన్న కాంబినేషన్స్ మరికొన్ని ఉన్నాయి.ఫలనా సినిమాలో ఫలనా హీరోయిన్ చేయనున్నారనే వార్తలు కోలీవుడ్‌లోనూ గట్టిగానే వినిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్‌హాసన్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ పూజా హెగ్డే, ప్రియాంకా అరుల్ మోహన్ వంటి తారల పేర్లను పరిశీలిస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అనంతరం హీరో అజిత్– దర్శకుడు రవి కె. చంద్రన్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. శింబు కొత్త సినిమా ‘అరసన్’లో హీరోయిన్గా సమంత, కయాదు లోహర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు కథనాయికలకు చోటు ఉందట. శ్రీలీల, మీనాక్షీ చౌదరి ఈ సినిమాలో నటించనున్నారనే పుకార్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
మీరా నందన్.. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ, 'జై బోలో తెలంగాణ' హీరోయిన్ అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. 2011లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో తెలంగాణ యువకుడిని ప్రేమించే ఆంధ్రా అమ్మాయిగా మీనా నందన్ నటించి, మెప్పించింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఆ సినిమా రిలీజ్ తర్వాత మీరా నందన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. మీరా నందన్ మాత్రం చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసింది.కొన్నాళ్ల తర్వాత మలాయళంలో కొన్ని టీవీ షోస్ కూడా చేసింది. సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్‌గానూ చేసింది.2008లో ‘ముల్లా’ అనే మూవీతో హీరోయన్‌గా మారింది. ‘వాల్మీకి’ అనే సినిమాతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత తమిళ్లో వరుస అవకాశాలు వచ్చాయి. 'జై బోలో తెలంగాణ' తర్వాత తెలుగులోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి. కానీ మీరానందన్ ఆసక్తి చూపించలేదు. అంతేకాదు కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే 2014లో 2024లో తన బాయ్‌ఫ్రెండ్, అకౌంటెంట్ శ్రీజుని వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చి, తన మకాంను దుబాయ్‌కి మార్చింది. ప్రస్తుతం ఆమె అక్కడ ఒక ప్రముఖ మలయాళ రేడియో స్టేషన్లో రేడియో జాకీ పనిచేస్తున్నారు. రేడియో రంగంపై ఉన్న ఆసక్తితోనే ఆమె సినిమాలను పక్కన పెట్టి ఈ వృత్తిని ఎంచుకున్నట్లు సమాచారం.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ట్రావెల్ ఫోటోలను, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినా, తనదైన శైలిలో అభిమానులకు చేరువగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Meera Nandhaa (@nandan_meera) -
'సెట్లో అందరూ చూస్తుండగా దారుణంగా'.. సౌత్‌పై తాప్సీ బోల్డ్ కామెంట్స్
హీరోయిన్ తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అస్సీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా తాప్సీ పన్ను ప్రమోషన్స్‌కు హాజరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది ముద్దుగుమ్మ. సౌత్‌లో షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెప్పేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది. షూట్లో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎలా అసౌకర్యంగా ఉంటాయో ఒక మహిళగా నాకు తెలుసన్నారు. ఏదైనా సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు అందరూ గమనిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందోనని ఓపెన్‌గా మాట్లాడింది. తాజాగా తాప్సీ చేసిన కామెంట్స్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.నాభిపైనే మోజుఎందుకు..?అంతేకాకుండా సౌత్ సినిమాల్లో పాటల్లో నాభిపై అంతగా మోజు ఎందుకని తాప్సీ ప్రశ్నించింది. అసలు అక్కడే ఎందుకు ఫోకస్ పెడతారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు.. కానీ సౌత్ సినిమాల్లో ఉన్నంతగా మాత్రం ఉండదని తాప్సీ తన మనసులో మాటను బయటపెట్టేసింది.కాగా.. గతంలో కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, కొబ్బరికాయలు వేసే సంప్రదాయంపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది ముద్దుగుమ్మ.తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన అస్సీ ఫిబ్రవరి 20న విడుదలైంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్‌రూమ్ డ్రామాను థియేటర్స్‌లో చూడాలని ఆమె కోరింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించగా.. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కనిపించింది.Opens Up About an Embarrassing On-Set ExperienceIn the South, they often asked me to wear a padded bra. It was embarrassing during song shoots when everyone noticed the difference.:- Actress #TaapseePannu#ASSIMoviepic.twitter.com/cWNFXiusRC— Milagro Movies (@MilagroMovies) February 22, 2026 -
'కుడి కన్ను ఫోకస్ చేయమని చెప్పింది.. ఆ సీన్ చేశాక షాకయ్యా'
హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం సరస్వతి. ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తన కూతురి కోసం ఈ క్రూరమైన ప్రపంచానికి ఎలా ఎదుర్కొందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి మాట్లాడారు. సావిత్రి, ఊర్వశి శారద లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ అని కొనియాడారు. క్రాక్ మూవీలో జయమ్మ క్యారెక్టర్ చూసి ఇలా ఉంటుందా అని.. మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ వాళ్లంతా కూడా షాకయ్యారని వెల్లడించారు. ఆ సీన్ చేసే సమయంలో ఒక చిన్న ఎక్స్‌ప్రేషన్ ఉందని వరలక్ష్మీకి చెప్పానని తెలిపారు. వెంటనే ఆమె కుడి కన్నుకు కెమెరా పెట్టండని నాతో చెప్పింది.. ఆ షాట్ చెప్పగానే ఆమె కుడి కంటి నుంచి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయని గోపిచంద్ అన్నారు. అది చూసి నేను కూడా షాకయ్యానని వెల్లడించారు. అంతా ఎక్స్ట్రార్డినరీ ఫర్మామెన్స్ వరలక్ష్మీదేనని ప్రశంసించారు. అంతేకాకుండా బాలయ్యతో వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు నాలుగు పేజీల డైలాగ్స్ ఇచ్చామని గోపీచంద్ తెలిపారు. రెండున్నర్ర రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం.. కానీ మూడు గంటల్లోనే సీన్ అయిపోయిందన్నారు. ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లోనే పూర్తి చేసిందని వరలక్ష్మీపై ప్రశంసలు కురిపించారు. వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసి ఊర్వశి శారద గారిని చూసినట్లు ఉందని బాలయ్య అన్నారని తెలిపారు. -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో నిహారిక.. జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ రమ్య..!
కొత్త లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లేటేస్ట్ లుక్..కలర్‌ఫుల్ డ్రెస్‌లో టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల..వైట్ డ్రెస్‌లో వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా..జిమ్‌లో చెమట్చోడుస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష..శారీలో నటి నిక్కీ గల్రానీ అందాలు.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Ramya moksha kancharla (@ramya_moksha) View this post on Instagram A post shared by Archana Singh Rajput (@rajput_archanasingh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
రెడ్ రోజ్‌లా జ్యోతి పూర్వాజ్.. పట్టుశారీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే..!
రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..పట్టుశారీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు..అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే వైబ్స్..ఈషా ఫౌండేషన్ జ్ఞాపకాల్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి.. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
'సేల్స్ గర్ల్‌గా కూడా పనిచేశా'.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్ స్రవంతి
సుహాస్ హీరోగా నటిస్తున్న హే బల్వంత్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి. ఈ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్రవంతి తన కెరీర్లో ఎదురైన ఇబ్బందులు పంచుకుంది. ఒకానొక సమయంలో డైమండ్ జ్యూవెలరీ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా కూడా ఉద్యోగం చేశానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ జాబ్ చేసేటప్పుడు గంటలకొద్ది నిలబడే ఉండాలని తెలిపింది. ఆ సమయంలో నిలబడలేక చాలా ఇబ్బంది పడ్డానని బోరున ఏడ్చేసింది. అయితే ఈ ఉద్యోగం నా ఇష్టంతోనే చేశానని.. నా జీతం కంటే ఇన్సెంటివ్స్ ఎక్కువగా వచ్చేదని వెల్లడించింది.ఇటీవల ఎక్కువగా సినిమా ప్రమోషన్స్‌లో పైకి నవ్వుతూ కనిపించే స్రవంతి.. తన కెరీర్లో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొని ప్రస్తుతం టాలీవుడ్లో రాణిస్తోంది. అభిరామ్ అనే వ్యక్తి తాను ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది. స్రవంతి చొక్కారపు స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. 2009లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ నటి అవడానికి చాలా టైమ్ పట్టింది. -
'రాణి ఎప్పటికీ రాణినే'.. నమ్రతపై వారణాసి బ్యూటీ ప్రశంసలు..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌పై వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. రాణి ఎప్పటికీ రాణినే ఉంటూ ఓ వీడియోను షేర్ చేసింది. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న వీడియోను పంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు మహేష్ బాబును కూడా ట్యాగ్ చేసింది.కాగా.. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రతా శిరోద్కర్ మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. నమ్రతా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే ఏడాది నమ్రతా ప్రపంచ అందాల పోటీల్లో మనదేశం తరఫున పాల్గొని టాప్-6లో ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. కాగా.. ఆ తర్వాత మిస్ వరల్డ్ -2000 పోటీల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఏకంగా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.నమ్రతా సినీ కెరీర్నమ్రతా తొలిసారిగా 1977లో శత్రుఘ్న సిన్హా నటించిన షిర్డీ కే సాయి బాబా చిత్రంలో నటించింది. 1998లో మేరే దో అన్మోల్ రతన్ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన నమ్రతా.. 2000 ఏడాదిలో వంశీ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలను నమ్రతా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. View this post on Instagram A post shared by The Crown Journal (@the_crown_journal) -
సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డ్.. టీమ్ ఆగ్రహం..!
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.'విజయ్- రష్మిక పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెంబర్ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయవద్దని' విజయ్ టీమ్ పేర్కొంది.Special request from Team Vijay Deverakonda & Rashmika !! As many people were posting the marriage details of Vijay & Rashmika including the RSVP contact and venue. The team now are requesting not to post such sensitive information online which could lead to unnecessary fanfare… pic.twitter.com/YESwrwNumE— Filmy Focus (@FilmyFocus) February 18, 2026 -
పింక్ శారీలో ది రాజాసాబ్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో సమంత పోజులు..!
వజ్రాల్లాంటి బ్లాక్ డ్రెస్‌లో సమంత హోయలు..హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ లుక్..సెలయేరు వద్ద హీరోయిన్ ప్రియమణి చిల్..పింక్ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ అందాలు..పట్టుశారీలో మరింత అందంగా బిగ్‌బాస్ సోనియా...ఎల్లో చీరలో కాయాదు లోహర్ బ్యూటీపుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
మెగా కోడలి కొత్త సినిమా.. క్రేజీ లవ్ సాంగ్ వచ్చేసింది
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు. -
హ్యాపీ బర్త్ డే కేరళ కుట్టీ.. అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ (ఫొటోలు)
-
బేబీ హీరోయిన్ లేటేస్ట్ లుక్..శారీలో సింగర్ మధు ప్రియ..!
ఈషా ఫౌండేషన్ ఈవెంట్ జ్ఞాపకాల్లో తమన్నా..జిమ్‌లో కష్టపడుతోన్న సుకుమార్ సతీమణి తబిత..శారీలో సింగర్ మధు ప్రియ..బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటేస్ట్ లుక్..హీరోయిన్ రంభ గ్లామరస్ లుక్.. View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
ఎవరీ ప్రత్యూష.. 2002 ఫిబ్రవరి 23న ఏం జరిగింది?
సినీ తారలు కూడా సాధారణ మనుషులే. వాళ్లకు బాధలు ఉంటాయి. అయితే ఆ బాధలను కప్పిపుచ్చుకుని స్క్రీన్ మీద అందాలతో, నవ్వులతో అభిమానులను అలరిస్తుంటారు. అందరిలాగే తారల జీవితాల్లోనూ ఎవరికీ తెలియని వేదనలు, విషాదాలు దాగి ఉంటాయి. అలాంటి హృదయవిదారక కథే నటి ప్రత్యూషది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రేమ పోటుకు బలైపోయింది. ఈ విషాద ఘటన జరిగి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత సుప్రీం కోర్టు నేడు(మంగళవారం) తన తుది తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.అలా సినిమాల్లోకి.. ప్రత్యూష సొంతూరు భువనగిరి. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉండేది. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని గోల్ పెట్టుకొని..ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెకు సిద్ధార్థరెడ్డితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇంటర్ అయిపోగానే ఆమె సినిమాల్లోకి వెళ్లగా.. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అప్పట్లో జరిగిన ‘మిస్ లవ్లీ స్మైల్’ పోటీలో ప్రత్యూష్ పాల్గొని.. విజయం సాధించింది. దీంతో ఆమెకు 1998లో ‘రాయుడు’ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అది రిలీజ్ అయిన తర్వాత ప్రత్యూషకు వరుస అవకాశాలు వచ్చాయి. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని.. ఇలా నాలుగేళ్ల కెరీర్లో తెలుగు, తమిళ్లో కలిసి 12 సినిమాల్లో హీరోయిన్గా నటించింది.ఫిబ్రవరి 23న ఏం జరిగింది?ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సిద్ధార్ధ్‌తో స్నేహాన్ని కంటిన్యూ చేసింది. కొంతకాలం పాటు బాగానే ఉన్నా..తర్వాత విబేధాలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఓ బ్యూటీ పార్లర్లో ప్రత్యూష, సిద్ధార్థ్ కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్లి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ కూల్‌డ్రింక్‌లో విషయం కలుపుకొని తాగారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా.. సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రేమికుల ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను ముగించే సమయంలో కీలక విషయం బయటకు వచ్చింది.ఆత్మహత్యా? హత్యా?ప్రత్యూషది ఆత్మహత్య కాదని.. ఎవరో ఆమె గొంతు నులిమి చంపారని ఓ ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు కోసం వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం చేసిన విచారణలో ప్రత్యూషది ఆత్మహత్యేనని తేలింది. పురుగులమందు కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదంటూ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేరం కింద సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అతడిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ శిక్షను మూడేళ్లకు కుదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని కూడా సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టుకి వెళ్లాడు. అయితే సుప్రీంలో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులకు లొంగిపోవాల్సిదేంటూ మంగళవారం సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. -
కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ సలహా
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని అక్క కొడుకు అజయ్ దీషన్ కథానాయకుడిగా నటించిన లేటేస్ట్ మూవీ బూకీ(తమిళంలో పూకీ). ఈ సినిమాకు గణేశ్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో బూకీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో కూడా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై హీరో అజయ్ దీషన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. రిలేషన్షిప్ విషయంలో విజయ్ ఆంటోనీ మీకు ఎలాంటి సలహా ఇచ్చారని హీరోను అడిగింది. రిలేషన్షిప్లో ఒక ఫ్రెండ్‌గా ఉండమని చెప్పాడని.. ఆ స్నేహం ఒక ఐదేళ్ల పాటు కొనసాగితే అప్పుడు ఆలోచించాలని సలహా ఇచ్చాడని అన్నారు. ఇది విన్న మంచు లక్ష్మీ కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు అని సలహా ఇచ్చింది.అంతేకాకుండా ఈ మూవీ టైటిల్ గురించి కూడా మంచు లక్ష్మీ మాట్లాడింది. పూకీ అనే పదం తమిళంలో క్యూటీ అని అర్థమని చెప్పుకొచ్చింది. యంగ్‌స్టర్స్ ఎక్కువగా ఈ పదాన్ని వాడతారని తెలిపింది. సినిమాల వల్ల డబ్బులు పొగొట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ స్పందించింది. అవునండి.. అప్పులు అనేవి వందశాతం నిజం.. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నానని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో ధనుషా హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు నటించారు. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు.. - మంచు లక్ష్మి రిలేషన్ షిప్ అడ్వైజ్#ManchuLakshmi #Bookie #AjayDhishan #VijayAntony pic.twitter.com/tzYpB01CQt— Filmy Focus (@FilmyFocus) February 17, 2026 -
నన్ను వేరేలా చూసేవారు.. బాలీవుడ్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు
సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ స్టార్ హోదా వచ్చాకా..బాలీవుడ్‌కి వెళ్లి సత్తా చాటాలని అనుకుంటారు. సౌత్‌లో రెండు, మూడు హిట్లు పడితే చాలు.. బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తారు. అలా దక్షిణాది నుంచి వెళ్లిన తారల్లో కొంతమంది బాలీవుడ్‌లోనూ రాణిస్తే.. మరికొంతమంది అవకాశాలు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి వచ్చారు. చాన్స్‌ల సంగతి పక్కన పెడితే.. సౌత్ వాళ్లకు సరైన గౌరవం కూడా ఇవ్వరని అంటోంది నటి రేజీనా కసాండ్రా. 16 ఏళ్లకే కెరీర్‌ని ప్రారంభించిన రెజీనా.. తెలుగులో రవితేజ, గోపీచంద్, సాయిదుర్గు తేజ్, సందీప్ కిషన్ లాంటి హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఇక్కడ వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ ప్రయత్నాలు చేసింది. ‘ఏక్ లడ్కీకో దేఖా తో ఐసా లగా’ అనే చిత్రంలో ఆమె నటించింది. ఆ మూవీతో రెజీనాకు కూడా అంత పేరేమీ రాలేదు. తర్వాత మరి కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ సినిమా ఫలితాల సంగతి పక్కన పెడితే.. అసలు బాలీవుడ్‌కి దక్షిణాది నటీనటులు అంటే చిన్నచూపు అని.. వాళ్ల ప్రవర్తననే వెరైటీగా ఉంటుందని రెజీనా అంటోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లో తనకు ఎదురైన అనుభవాల గురించి రెజీనా చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్ లో నా ప్రయాణం ఊహించినంత సులభంగా సాగలేదు. హిందీ భాషపై నాకు పూర్తి పట్టు ఉన్నా, మాట్లాడటంతో పాటూ హిందీ రాయగలిగినా, వేరే సినిమాల్లో ఇతర హీరోయిన్లలాగా డబ్బింగ్ ఆర్టిస్టులను వినియోగించుకోకపోయినా బాలీవుడ్ లో నేను పూర్తిగా కలిసిపోయాననే ఫీలింగ్ కలగలేదు. సౌత్ నుంచి వచ్చిన నన్ను కొందరు వేరేలా చూశారు. నా నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన, మాట తీరు అసౌకర్యానికి గురి చేసింది. అవన్నీ చూశాక నాలో ఒక రకమైన భయం మొదలైంది’ అని రెజీనా చెప్పుకొచ్చింది.ఇలాంటి అనుభవం అందరికి ఎదురవుతుందని కూడా చెప్పలేమన్నారు. అంతేకాదు బాలీవుడ్ మొత్తం అలాంటిదే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదని రెజీనా అన్నారు. అందరూ ఒకేలా ఉండరని, తనకు మద్దతుగా నిలుస్తూ, గౌరవించిన వాళ్లు కూడా ఉన్నారని రెజీనా చెప్పింది. -
టాలీవుడ్లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. -
అమ్మకు రెండో పెళ్లి.. అవన్నీ అబద్ధాలే: సుప్రీత
టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవలే బిగ్ స్క్రీన్‌పై సందడి చేసింది. అమరావతికి ఆహ్వానం పేరుతో వచ్చిన థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 13న థియేటర్లలోకి వచ్చిన టాలీవుడ్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్లో సుప్రీత ఫుల్ ఎమోషనలైంది. తన జర్నీని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.అంతేకాకుండా ఇటీవల సురేఖవాణి రెండో పెళ్లి గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన కేవలం నాది మాత్రమేనని.. అమ్మకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గతంలో మీ అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని నన్ను కొందరు అడిగారని పేర్కొంది.ఈ ప్రశ్నకు తాను అవును సమాధానమిచ్చానని సుప్రీత తెలిపింది. కానీ చాలామంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. నా మాటలు విని అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు రాసుకొచ్చారని పేర్కొంది. అదంతా పూర్తిగా అబద్ధమని.. అమ్మకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. ఆమెకు మ్యారేజ్ చేయాలన్న ఆలోచన నాది మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది -
'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు
హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.స్పందించిన త్రిష..'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.అసలేం జరిగిందంటే..అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. -
పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..!
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్ యాక్టర్ తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. పవిత్రా లోకేశ్‌కు నరేశ్ స్వీట్ విషెస్..!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా సుహాస్ హీరోగా వస్తోన్న హే భగవాన్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. శివానీ నాగారం హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే నరేశ్ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పవిత్రా లోకేశ్‌తో సరదా ఇంటర్వ్యూ జరిగింది. హే భగవాన్ మూవీ గురించి పవిత్రా లోకేశ్ ప్రశ్నలు అడగ్గా.. నరేశ్ సమాధానాలిచ్చారు. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేను మరిచిపోలేని పది సినిమాల్లో పాత్రల్లో ఇది ఒకటని అన్నారు. నాతో ఇంటర్వ్యూ ఎలా ఫీలవుతున్నారని పవిత్రా అడగ్గా.. నువ్వు చాలా బాగా మాట్లాడావ్.. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి యాంకర్ అవుతావని నేను నమ్ముతున్నా అంటూ పంచులు వేశారు.అంతేకాకుండా వాలెంటైన్స్ డే కావడంతో పవిత్రకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.. ప్రియతమ నువ్వు అచట కుశలమా.. నేను ఇచట కుశలమే అంటూ లవ్ సాంగ్ పాడుతూ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేమికుల రోజున మూవీ ప్రమోషన్‌తో పాటు వీరిద్దరి ప్రేమబంధం చూసిన ఆడియన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పవిత్రకే బిజినెస్ ఏంటో చెప్పలేదు...మీరు చెబితే 20K,#Guess Cheyyandi#HeyBhagawan pic.twitter.com/hwOA60mRVh— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026 -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్‌కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్‌గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. -
అమలాపాల్ ఫుల్ గ్లామరస్.. సంయుక్త మీనన్ బ్యూటిఫుల్ పిక్స్..!
ఫుల్ గ్లామరస్తో మెరిసిపోతున్న హీరోయిన్ అమలా పాల్..స్వయంభూ బ్యూటీ సంయుక్త మీనన్ లేటేస్ట్ పోజులు..యూకేలో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..బ్లాక్ డ్రెస్‌లో కల్యాణి ప్రియదర్శన్ గ్లామరస్ పిక్స్.. స్టైలిష్ హెయిర్ లుక్‌లో హీరోయిన్ ప్రియమణి.. View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by SEERATH SHEIK | MAKE-UP ARTIST (@seerathmystique) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)
-
'స్వయంభు' మూవీ ప్రెస్మీట్లో మెరిసిన హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
శారీలో మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్.. జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్..!
శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్..ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
అతను నా నెంబర్ కోసం రూ.20 వేలు ఖర్చు చేశాడు: సురేఖ వాణి కూతురు
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమె ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆమె అందాన్ని పొగుడుతూ పలువురు నెటిజన్లు కామెంట్ కూడా చేస్తుంటారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తుంటారు. అలా తనకు వెరైటీగా వచ్చిన ఒక ప్రపోజల్ గురించి మీడియాతో పంచుకుంటి అందాల తార సుప్రీత. ఆమె హీరోయిన్గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకొచ్చిన ఓ వెరైటీ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది.‘నాకు రెగ్యులర్‌గా ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటిని నేను లైట్ తీసుకుంటా. కొన్ని మెసేజ్‌లు చూసి నవ్వుకుంటాను. ఈ మధ్య ఒకతను నా మొబైల్ నెంబర్ కోసం రూ. 20 వేలు ఖర్చు చేశాడట. నా నెంబర్ కనుకొన్ని ఆయన మెసేజ్ చేశాడు. ‘మీ నెంబర్ కోసమే నేను రూ. 20 వేలు ఖర్చు చేశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి. నన్ను పెళ్లి చేసుకో.. చాలా బాగా చూసుకుంటాను. మీ నెంబర్ కోసమే అంత డబ్బు ఖర్చు చేశానంటే.. నిన్ను ఎలా చూసుకుంటానే అర్థం చేసుకో’ అని స్మార్ట్‌గా ప్రపోజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి నవ్వుకొని అతన్ని బ్లాక్ చేశా’ అని సుప్రీత చెప్పుకొచ్చింది.ఇక తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెబుతూ.. ‘నన్ను భరించేవాడు దొరికితే చాలు. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. అలా అని ఖాలీగా ఉండకూడదు. ఏదో ఒక బిజినెస్ చేస్తూ..ఫ్రీ టైం మొత్తం నాతోనే గడపాలి. కలిసి బయటకు వెళ్లాలి. నేనే ఎక్కువ కేరింగ్ చేస్తా. నేను వండి పెట్టింది తింటూ నాతో ఉంటే చాలు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. -
మరింత హాట్‌గా జ్యోతి పూర్వాజ్.. శారీలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల..!
బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు..టాలీవుడ్ నటి పూర్ణ బేబీ బంప్ ఫోటోలు..గ్రీన్ శారీలో ఫుల్ గ్లామరస్‌గా ఐశ్వర్య రాజేశ్..పూల లాంటి డ్రెస్‌లో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల.. బాయ్‌ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాయల్ రాజ్‌పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by BRIDAL JEWELRY RENTAL DUBAI, UAE (@rahz_allure_jewelry_rental_uae) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
ఒకే ఒక్కడు మూవీ షూటింగ్.. నాకోసం పది నిమిషాల్లోనే..!
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తండ్రి, కూతురు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఐశ్వర్య అర్జున్. తాను చెన్నైలో స్కూల్లో చదివే సమయంలో కడుపునొప్పిగా ఉందని డాడీకి కాల్ చేశానని తెలిపింది. అప్పుడు నాన్న ఒకే ఒక్కడు సినిమా షూటింగ్లో ఉన్నారు. దాదాపు నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను చెప్పగానే నాకోసం హుటాహుటిన స్కూల్‌కు వచ్చేశారని ఐశ్వర్య అర్జున్ వెల్లడించారు. ఆ రోజు నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చానని అర్జున్ సర్జా తెలిపారు. ఆ రోజు నా డ్రైవింగ్ చూసి చాలామంది తిట్టుకుని ఉంటారని అన్నారు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే కూతురంటే అర్జున్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రలు పోషించారు. -
కమిట్మెంట్ అడిగేదంతా అంకుల్స్ బ్యాచే : నటి షాకింగ్ కామెంట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై నటి ఎస్తర్ నోరోన్హా కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ కొనసాగుతుందని, కమిట్మెంట్ ఇస్తేనే చాన్స్‌లు ఇస్తామని చెప్పే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారని ఆరోపించింది. ఆడియన్స్ మాత్రమే క్యాస్టింగ్ కౌచ్‌ని కంట్రోల్ చేయగలరని ఎస్తర్ చెబుతోంది. ఆమె కీలకపాత్ర పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది.పేరు చెప్పరు..క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికే టాలీవుడ్లో కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితమే నాకు ఓ కాల్ వచ్చింది. కమిట్మెంట్కి ఓకేనా అడిగారు. నో చెప్పడంతో వదిలేశారు. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్‌తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్మెంట్ అడగలేదని చెబుతారు. కానీ అదంతా అబద్దం. చాలా మంది కాంప్రమైజ్ అయినవాళ్లే. నటన రానివాళ్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఎలా ఉంటారు? వాళ్లకు ఉన్న లోపాన్ని కప్పిపుచ్చాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరు అడిగారు అనేది ముందే చెప్పరు. ముందుగా మీడియేటర్ ద్వారా కమింట్మెంట్ గురించి అడిగిస్తారు. ఓకే అంటే రెమ్యునరేషన్ ఇలా, లేదంటే అలా చెబుతారు. మనసైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. అడిగింది ఎవరనే పేరుని చెబుతారు. అందుకే ముందుగానే కమిట్మెంట్ అడిగింది ఎవరు అని కనిపెట్టలేం.నా గురించి క్లారిటీ రాలేదుసినిమాలలో ఎప్పుడు చీరలో కనిపించి.. బయటికి దేవతలా కనిపించేవాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది వారికి క్లారిటీ రావడం లేదు. కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడి.. తర్వాత అలాంటి పనులు చేస్తుంటారు. నేను కూడా అదే క్యాటగిరీ అనుకొని కాల్ చేస్తుంటారు. ఆడియన్స్ కూడా ‘ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని‘ అనుకుంటారు. అలాంటి వాళ్లు నా ఫిల్మోగ్రఫీ చూడాలి. ఒకవేళ నేను కూడా కమిట్మెంట్కి ఓకే చెబితే.. ఇన్నేళ్లలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నా దగ్గరకు రాదా? నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఆదరిస్తున్నారు. ఆడియన్స్, మీడియా సపోర్ట్ నాకుంది. అలాంటప్పుడు ఎందుకు నాకు అవకాశం రాలేదో ఆలోచించాలి.వాళ్లంతా అంకుల్స్ బ్యాచ్ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువతరం.. కమిట్మెంట్ గురించి అడగడం లేదు. వాళ్ల చాలా ఫ్యాషన్‌తో పని చేస్తున్నారు. అలాంటి పనులు చేసేవాళ్లంతా పాత బ్యాచ్. వారందరిని నేను అంకుల్స్ బ్యాచ్ అని పిలుచుకుంటాను. వాళ్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనలోని లోపాలను ఆసరాగా చేసుకొని కమిట్మెంట్ గురించి అడుగుతారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కనిపించకుండే చేసే అవకాశం ఆడియన్స్‌కి మాత్రమే ఉంది. వాళ్లు ఫిక్స్ అయితే.. ఇక్కడ అలాంటి పనులు జరుగవు. హాలీవుడ్, బాలీవుడ్లో లాగా.. ఇక్కడ కూడా కాంప్రమైస్ అయి నటించే నటీనటులను బ్యాన్ చేయాలి. అలాంటి వాళ్లు ఎంత పెద్ద సినిమా చేసినా బాయికాట్ చేయాలి. అప్పుడే క్యాస్టింగ్ కౌచ్ ఆగిపోతుంది’ అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. -
ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది. ఓ బేబీ మూవీ తర్వాత సామ్‌తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ లీగ్‌ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్‌లో తన టీమ్ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. #TFNExclusive: #Samantha & #RajNidimoru celebrating and cheering with joy for their team 🤩#MaIntiBangaram #TeluguFilmNagar pic.twitter.com/H9nmfS2Lew— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2026 -
గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్.. నెట్టింట ఫోటోలు వైరల్
-
13 ఏళ్ల మిర్చి .. అనుష్క సినిమాల్లో.. శేఖర్ కమ్ముల హీరోయిన్ ఎక్కడ?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి. 2013 ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఊపేసింది. కొరటాల శివ డైరెక్షన్లో ఈ మూవీ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించింది. గుంటూరు పల్నాడు ప్రాంతంలో జరిగే ప్రతీకార నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటించగా..మరో హీరోయిన్గా రిచా గంగోపాధ్యాయ మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై సరిగ్గా నేటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.అనుష్క ఇంకా సినీ ఇండస్ట్రీలోనే..అనుష్క ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. గతేడాది ఘాటి మూవీతో అభిమానులను మెప్పించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో తెరెకెక్కించారు.రిచా గంగోపాధ్యాయ ఎక్కడ? రానా హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ లీడర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రీచా గంగోపాధ్యాయ. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రవితేజ సరసన మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లోనూ రీచా మెప్పించింది. ఆ తర్వాతనే మిర్చి సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.అయితే హీరోయిన్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ అందుకున్నా సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నేళ్లకే ఇండస్ట్రీకి టాటా చెప్పేసింది. 2013లో చివరిసారిగా భాయ్ సినిమాలో కనిపించింది. ా తర్వాత రీచా టాలీవుడ్ సినిమాలకు దూరమైంది.అమెరికన్‌తో పెళ్లి..ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మిర్చి బ్యూటీ.. ఆ తర్వాత తన ఫ్రెండ్, అమెరికాలోని పోర్ట్‌లాండ్‌కు చెందిన జో లాంగేల్లాను పెళ్లాడింది. 2021లో వీరిద్దరికీ ఓ బాబు కూడా జన్మించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా గతంలో తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పూర్తిగా సినిమాలకు దూరమైన రిచా.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) -
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్‌లాండ్‌లో శ్వేతామీనన్ చిల్..!
భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే బోల్డ్ లుక్స్..థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న శ్వేతామీనన్..పాట పాడుతూ హీరోయిన్ మాధవి చిల్..బాలీవుడ్ బుల్లితెర భామ మౌనీ రాయ్ లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన.. ఆ దెబ్బకు మారిపోయా'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్‌గా మారడానికి కారణాలను పంచుకుంది.తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్‌గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
డ్యాన్స్‌తో అదరగొట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..!
హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది పరాశక్తితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ మార్చి 26వ థియేటర్లలో సందడి చేయనుంది.ఇదిలా ఉంచితే శ్రీలీల తాజాగా హైదరాబాద్‌లోని ఓ మాల్ ఓపెనింగ్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తన టాలెంటన్ను బయటపెట్టింది. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్‌లోని దేక్లేంగే సాలా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల స్టెప్పులకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు.Actress #SreeLeela performs to #DekhLengeSaala from #UstaadBagathSingh at a shop opening! pic.twitter.com/Ilm1dpRLWL— idlebrain jeevi (@idlebrainjeevi) February 6, 2026


