హన్సిక మాజీ వదినకు షాక్.. ఏకంగా రూ.2 కోట్లకు..! | Hansika filed defamation suit on sister in law over domestic violence | Sakshi
Sakshi News home page

Hansika: హన్సిక మాజీ వదినకు షాక్.. ఏకంగా రూ.2 కోట్లకు..!

Apr 9 2026 5:56 PM | Updated on Apr 9 2026 6:20 PM

Hansika filed defamation suit on  sister in law over domestic violence

దేశముదురు చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ  హ‌న్సిక. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ నటించిన ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగానే 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం పటాపంచలైంది. ఈ ఏడాది మార్చి 11న ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఆ తర్వాత హన్సిక తీరుపై మాజీ వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ విమర్శలు చేసింది. హన్సిక విడాకులను ఉద్దేశించి అంతా ఫేక్ ప్రపంచం అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. వాస్తవానికి హన్సికకు, ముస్కాన్‌కు గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్‌ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్‌ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక  వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజాగా హన్సిక మాజీ వదినపై పరువునష్టం దావా వేసింది. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తోందని ముస్కాన్‌పై రూ.2 కోట్లకు పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ముస్కాన్‌.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్‌మెంట్స్ చేయకూడదని ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు సూచించింది. ఇటీవలే విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ టాపిక్ కాస్తా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సినిమా కెరీర్.. 

హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్‌, దేనికైనా రెడీ, పవర్‌.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్‌ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement