ఈవెంట్‌లో పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్ | Payal Rajput Full Emotional at First Time Movie trailer Launch Event | Sakshi
Sakshi News home page

Payal Rajput: 'ఆయనే నా రియల్ హీరో'.. పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం

Apr 28 2026 9:12 PM | Updated on Apr 28 2026 9:28 PM

Payal Rajput Full Emotional at First Time Movie trailer Launch Event

మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆర్‌‌ఎక్స్‌‌ 100 మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే ‌తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పంజాబీలో చాలా సినిమాలు చేయడంతో పాటు హిందీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే పంజాబీ ఫిల్మ్ ఖుష్ కబరీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.

తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ ఫస్ట్ టైమ్(01-01-01) మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సినిమాతో  సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్‌ ఈవెంట్ నిర్వహించారు.

పాయల్ కన్నీటి పర్యంతం..

ఈ ఈవెంట్‌కు పాయల్‌ రాజ్‌పుత్‌ సినీ కెరీర్‌, ఆరోగ్య సమస్యల గురించి ప్రశ్నించారు. దీనికి పాయల్ స్పందించింది. తన అనారోగ్యంతో జైపూర్‌లో పది రోజులు చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. ఆ సమయంలో మా ఫాదర్‌కు క్యాన్సర్‌ సోకిందని తెలిపింది. నా లైఫ్‌లో రియల్ హీరో మా నాన్నే అంటూ ఎమోషనలైంది. తన తండ్రిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా సినిమాలు చూడాలని నాన్న ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూసేవాడని తెలిపింది. నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనేనని పాయల్ వెల్లడించింది. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని వేదికపై బోరున ఏడ్చేసింది. దీంతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. కాగా.. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గతేడాది జూలై 28న క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement