తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..! | Nayanthara and Vignesh Shivan visit Tirupati temple ahead of LIK release | Sakshi
Sakshi News home page

Nayanthara-Vignesh: తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..!

Apr 9 2026 4:45 PM | Updated on Apr 9 2026 5:27 PM

Nayanthara and Vignesh Shivan visit Tirupati temple ahead of LIK release

కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. 

నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్‌ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్‌, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement