శృతిహాసన్‌పై పబ్లిక్‌లో కామెంట్స్‌.. నటి ఆగ్రహం..! | Kollywood actress Shruthi Haasan angry about calling him as mumma | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: శృతిహాసన్‌పై పబ్లిక్‌లో కామెంట్స్‌.. నటి ఆగ్రహం..!

Apr 19 2026 1:06 PM | Updated on Apr 19 2026 1:27 PM

Kollywood actress Shruthi Haasan angry about calling him as mumma

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న శృతిని రోడ్డుపై ఉ‍న్న కొందరు కామెంట్స్ చేశారు. శృతిని చూసి మమ్మ అంటూ పబ్లిక్‌లో గట్టిగా అరిచారు. ఇది విన్న శృతి హాసన్ 'కౌన్‌ హై మమ్మ.. హమ్‌ నే మమ్మ హై.. ఏ మాట్లాడుతున్నారు మీరు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ బండి ఎక్కడ ఉంది అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌ చేయడం లేదు. అడివి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా రజినీకాంత్ కూలీ చిత్రంలో కనిపించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే శృతి హాసన్‌కు రెండుసార్లు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement