సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా? | Samantha Maa Inti Bangaram postponed talk goes viral | Sakshi
Sakshi News home page

Samantha: సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా?

Apr 30 2026 6:49 PM | Updated on Apr 30 2026 7:17 PM

Samantha Maa Inti Bangaram postponed talk goes viral

టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్‌ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్‌పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ టైమ్‌లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్‌ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement