'చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా'.. రష్మిక ట్వీట్ వైరల్ | rashmika Mandanna Shares Her 30th Birthday Special Photos | Sakshi
Sakshi News home page

Rashmika: 'నా 30వ బర్త్ డే చాలా భిన్నంగా ఫీలయ్యా'.. రష్మిక ఆనందోత్సాహం

Apr 9 2026 9:16 PM | Updated on Apr 10 2026 9:41 AM

rashmika Mandanna Shares Her 30th Birthday Special Photos

ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్‌ రిలేషన్‌లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ ‍డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్‌తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ ‍‍అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్‌లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్‌ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్‌ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్..  కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్‌లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement