పెళ్లి వేడుకలో సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉందో చూశారా? | Megastar Meets Tollywood Veteran Actress Sarada at Marriage, Video Viral | Sakshi
Sakshi News home page

Sarada: పెళ్లి వేడుకలో సీనియర్ నటి శారద.. మెగా దంపతుల పలకరింపు

Apr 30 2026 4:09 PM | Updated on Apr 30 2026 4:24 PM

Megastar Meets Tollywood Veteran Actress Sarada at Marriage, Video Viral

సీనియర్ హీరోయిన్ శారద ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆమెను చూసిన మెగాస్టార్ దంపతులు దగ్గరికి వెళ్లి పలకరించారు. ప్రస్తుతం ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో శారద అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్‌ డైలాగ్స్‌తోనూ సినిమాల్లో మెప్పించారు. 

కాగా.. కన్యా శుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద..  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నటించి  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు.  అయితే శారద మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటి అయినప్పిటికీ.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌ రేంజ్‌కు ఎదిగారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు.. తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది.   తెలుగులో  అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్‌ చౌదరి, సర్దార్‌ పాపారాయుడు, స్టాలిన్‌, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement