ఆదా శర్మ.. మరో సెన్సేషనల్‌ సినిమా | The Kerala Story Actress Adah Sharma Announced One More Interesting Film Set For June 2026 Release, Post Went Viral | Sakshi
Sakshi News home page

Adah Sharma: గవర్నర్‌గా ఆదా శర్మ.. ఆసక్తిగా పోస్టర్‌

Apr 23 2026 2:59 PM | Updated on Apr 23 2026 3:28 PM

the Kerala Story Actress Adah Sharma announced one more interesting Film

ది కేరళ ‍స్టోరీ మూవీతో సెన్సేషనల్‌ హిట్ ‍కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్‌గా నిలిచింది.

తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్‌ ది సైలెంట్ సేవియర్‌ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్‌ పోస్టర్‌ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. 

ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్‌లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్‌ టైటిల్‌తోనే ఈ మూవీ థీమ్‌ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement