డిఫరెంట్‌ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా? | Tollywood actress Teena Sravya Movie ready For Release | Sakshi
Sakshi News home page

Teena Sravya: డిఫరెంట్‌ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా?

Apr 22 2026 9:28 PM | Updated on Apr 22 2026 9:28 PM

Tollywood actress Teena Sravya Movie ready For Release

కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా హీరోయిన్ టీనా శ్రావ్య. ఇప్పుడు మరోసారి గేదెల రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా ఆమెను ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేదెల రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇప్పటికే  విడుదలైన టీజర్, ట్రైలర్‌లో టీనా ఫర్మామెన్స్ చూస్తే ప్రామిసింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న క్యారెక్టర్స్‌లో టీనా అదరగొడుతోంది. టాలీవుడ్‌లో చిన్న బడ్జెట్ చిత్రాలకు ఈమె పర్ఫెక్ట్ ఆప్షన్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆమె డైలాగ్ డెలివరీతో పాటు అందం, అమాయకపు నటనా శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈనెల 24న విడుదల కానున్న గేదెల రాజు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement