మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!
'కమిటీ కుర్రోళ్లు', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి టీనా శ్రావ్యపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మేడారం జాతరకి వెళ్లిన ఈమె.. మొక్కు చెల్లించుకోవడమే దీనికి కారణం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర.. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున జాతర జరగనుంది. దీనికి లక్షలాది మంది భక్తులు రానే వస్తారు. అయితే జాతరకు రెండు వారాల ముందు నుంచే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి. చాలామంది తమ బరువంతా బెల్లం(బంగారాన్ని)ని దేవతలకు మొక్కుగా చెల్లిస్తారు.టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా ఇలానే తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి.. సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోపై సోషల్ మీడియలో డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈమె చేసిన పనికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. భక్తులు, ఆదివాసీ దేవతలను అవమానించడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీనా తల్లి మాత్రం మొక్కులో భాగంగానే ఇలా చేశామని సమర్థించుకున్నారు.(ఇదీ చదవండి: 14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్) View this post on Instagram A post shared by Teena sravya.kundoju (@teena_sravya_mom)