'నా సోనును కోల్పోయా'.. బిగ్‌బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్ | Bigg boss ashwini sree Shared Sad News In SOcial Media | Sakshi
Sakshi News home page

Ashwini Sree: 'నా సోనును కోల్పోయా'.. బిగ్‌బాస్ అశ్విని ఎమోషనల్ పోస్ట్

Apr 22 2026 5:00 PM | Updated on Apr 22 2026 5:32 PM

Bigg boss ashwini sree Shared Sad News In SOcial Media

బిగ్‌బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ.  బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్‌తో హౌస్‌లో అలరించింది. ఈ షో ద్వారా టాలీవుడ్‌లో మరింత ఫేమ్ తెచ్చుకుంది.  ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

తాజాగా బిగ్‌బాస్ అశ్విని శ్రీ కన్నీటి పర్యంతమైంది. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిన విషాద వార్తను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ ఫుల్ ఎమోషనలైంది. సోనుకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లే చనిపోయాడని అశ్విని శ్రీ తెలిపింది.  

అశ్విని శ్రీ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను నా సోను బాయ్‌ని కోల్పోయా.. ఈ బాధ భరించరానిది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నా అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. 
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement