అలాంటి ప్రశ్న వేయడమే తప్పు : శ్రియ | Shriya Saran Says Age And Marriage Should Not Define An Actress Career In Films, Deets Inside | Sakshi
Sakshi News home page

Shriya Saran: అలాంటి ప్రశ్న వేయడమే తప్పు

Apr 27 2026 7:55 AM | Updated on Apr 27 2026 11:00 AM

Shriya Saran Say Age Is Not A Barrier For a Female Actors

ఇంతకుముందు హీరోయిన్లను వెంటాడే భయాల్లో ఒకటి పెళ్లి, మరొకటి వయసు. పెళ్లి అయితే హీరోయిన్‌ అవకాశాలు పోతాయేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. అదేవిధంగా వయసు మీరితే అందం కరిగిపోతుందనే భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడా భయం ఎవరిలోనూ కనిపించడంలేదు. పెళ్లి అయ్యి, నాలుగు పదుల వయసు దాటిన నటీమణులు కూడా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. 

అలాంటి వారిలో శ్రియ ఒకరు. ఈ భామ దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా వెలుగొందారు.  కాగా వివాహానంతరం నటనకు కొద్ది కాలం దూరంగా ఉన్న శ్రియ ఇప్పుడు మళ్లీ నటించడంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి మెప్పించారు.  ఈ భామను ఇటీవల 43 మూడేళ్ల వయసులో ఇంత అందాన్ని ఎలా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు, ఎలా అవకాశాలను అందుకుంటున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రియ బదులిస్తూ వయసును బట్టి నటీమణులను అంచనా వేయరాదంటూ ఘాటుగా పేర్కొన్నారు. 

అసలు ఈ ప్రశ్న వేయడమే తప్పు అన్నారు. వయసుతో పని ఏముంది? పెళ్లి అయితే నటీమణుల పని అయిపోతుంది అన్న ఆలోచనే రాకూడదు అని అన్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో సాధించడానికి వయసు ఆటంకమే కాదన్నారు. ప్రతిభ ముఖ్యమని, ప్రతి భావంతులైన కళాకారులు ఏ వయసులోనైనా సాధించగలరని అన్నారు. కాగా 43 ఏళ్ల వయసులోనూ తరగని అందాలతో ఆకట్టుకుంటున్న శ్రియ ఇప్పటికీ ఐటమ్‌ సాంగ్స్‌లో నటించడానికి సిద్ధం అంటున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement