నేను ఏ తప్పు చేయలేదు.. చేయను కూడా..: సింగర్ మంగ్లీ | Singer Mangli clariity about Her Case on Micro finance scam | Sakshi
Sakshi News home page

Singer Mangli: నేను కూడా బాధితురాలినే.. సింగర్ మంగ్లీ ఆవేదన

Apr 16 2026 3:24 PM | Updated on Apr 16 2026 3:46 PM

Singer Mangli clariity about Her Case on Micro finance scam

టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.

మధునాయక్‌ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్‌ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.

మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది.  నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement