విష్ణు ప్రియ వివాదం.. మొహం చాటేసిన యాంకర్..! | Anchor Vishnu Priya escape from media attention video goes viral | Sakshi
Sakshi News home page

Vishnu Priya: విష్ణు ప్రియ వివాదం.. మొహం చాటేసిన యాంకర్..!

Apr 13 2026 9:57 PM | Updated on Apr 13 2026 9:57 PM

Anchor Vishnu Priya escape from media attention video goes viral

టాలీవుడ్‌ యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై . ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించేందుకు యత్నించగా మొహం చాటేసుకున్నారు. మీరు ఎంత డబ్బులు సంపాదించారని కొందరు ఆమెను అడిగారు. దీంతో తన చేతులను మొహానికి అడ్డుగా పెట్టుకుని.. మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. 

అసలేం జరిగిందంటే?..

ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్‌ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్‌గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్‌స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement