టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ గౌతమ్ రాజు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రస్తుతం చాలా ఆరోగ్యంగానే ఉన్నానని గౌతమ్ రాజు తెలిపారు. నటుడిగా వందల సినిమాల్లో నటించానని వెల్లడించారు. నా గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను బాధపెట్టేలా వార్తలు రాశారని గౌతమ్ రాజు అన్నారు. నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని రాశారు. దయచేసి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. నా కెరీర్లో నటుడిగా చెప్పుకోవడానికి నా దగ్గర వందల సినిమాలు ఉన్నాయని కూడా వెల్లడించారు.
కాగా.. గౌతమ్ రాజు నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా కొన్ని వందల సినిమాలు చేశారు. అగ్ర హీరోల చిత్రాల్లో తనదైన హవాభావాలతో, నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా.. సీరియల్స్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రూమర్స్ రావడంతో సోషల్ మీడియాలో స్పందించారు. తాను 200లకు పైగా సినిమాల్లో నటించానని గౌతమ్ రాజు వెల్లడించారు. ఘరానా మొగుడు, వినోదం, ప్రేమకు వేళాయెరా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని గుర్తుచేశారు.
(ఇది చదవండి: రణబాలిలో నా రోల్.. ఆమె పేరుతోనే: రష్మిక)
తాను ఏ పత్రికకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని గౌతమ్ రాజు తెలిపారు. తనపై వచ్చిన వార్తను చూసి స్నేహితులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారిని చూసి జాలిపడటమే కాకుండా.. వీలైతే సహాయం చేయాలని అన్నారు. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. తన గురించి తప్పుడు కథనాలు రాయొద్దని.. సోషల్ మీడియా ప్రతినిధులను కోరారు.


