విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్కు హీరోయిన్ రష్మిక మందన్నా హాజరయ్యారు. ఈ సందర్భంగా రణబాలిలో తన రోల్కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను ఇంకా సినిమా చూడలేదని.. మీతో కలిసి థియేటర్లో చూస్తానని అన్నారు. తాను మూవీ సెట్స్లో వెళ్తుంటే భయం భయంగా వెళ్తానని రష్మిక తెలిపింది. అందరూ సీరియస్గా వర్క్ చేస్తుంటే..తాను మాత్రం భయపడతాననని వెల్లడించింది. ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు జయమ్మ అని.. అది మా డైరెక్టర్ రాహుల్ మదర్ గారి పేరు అని రష్మిక రివీల్ చేశారు. అందుకే అక్కడే నేను కనెక్ట్ అయిపోయానని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు.


