బిగ్‌బాస్ బాస్ ఆరో వారంలో మరింత ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీతో హౌస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన మాటల యుద్ధం తర్వాత ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. షాలిని, వర్షిణి, వంశీ, రాం ప్రసాద్, అమన్, రోహిత్ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి ఈ వారంలో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వీకెండ్ ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. తాజా ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూద్దాం.
నామినేషన్స్ ముగియడంతో హౌస్‌లో టాస్క్‌ల గోల మొదలైంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు.. హౌస్‌లోని ఓజీస్కు బిగ్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్‌లో ఉన్న సభ్యులపై మీ అభిప్రాయాలను తెలపాలని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను కోరారు బిగ్‌బాస్. వీటిలో త్రిగుణ్‌ను మానిపులేటర్గా...షాలిని విక్టిమ్ కార్డ్ అంటూ ట్యాగ్స్ ఇచ్చారు వైల్డ్ ఫైర్స్. ఆ ముకేశ్ అన్ట్రస్ట్ అని.. రోహిత్‌ను డ్రామా కింగ్‌గా తేల్చేశారు. అలా ఒక్కొక్కరికీ ఒక్కో ట్యాగ్ ఇచ్చారు.
(ఇది చదవండి: నన్ను బాధపెట్టేలా చేయకండి: సీనియర్ నటుడు గౌతంరాజు)
ఆ తర్వాత రెండు టీమ్‌లకు ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో పోటీపడిన తర్వాత షాలినిని విక్టిమ్ కార్డ్ అంటూ వైల్డ్ ఫైర్స్ తేల్చేశారు. రామ్ ప్రసాద్ సైతం షాలినినే అని అన్నారు. చివరికీ శివకుమార్, షాలిని, రోహిత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వు ఇక యాక్టింగ్ ఆపు శివ అంటూ రోహిత్ రెచ్చిపోయాడు. షాలినిని విక్టిమ్ కార్డ్ అనడంతో తనదైన శైలిలో రెచ్చిపోయింది. మీరే విక్టిమ్ కార్డ్ ప్లే చేశారంటూ కామనర్ రామకృష్ణపై ఫైరయింది. అలా ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయింది.


