విజయవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శతచండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని నేరుగా అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు.
తర్వాత కనకదుర్గనగర్లోని ఏర్పాటు చేసిన కౌంటర్లలో లడ్డూలను కొనుగోలు చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు.


