ఈమె టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా? | Tollywood Actress Shared Throwback Pics In Social Media goes Viral | Sakshi
Sakshi News home page

Tollywood Actress: ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో మరదలు ఎవరో తెలుసా?

May 6 2026 4:12 PM | Updated on May 6 2026 9:23 PM

Tollywood Actress Shared Throwback Pics In Social Media goes Viral

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికీ ఇష్టముండదు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే అవే గుర్తుకొస్తాయి. 90స్‌ కిడ్స్‌కు మొబైల్ కెమెరాలు లేక సరిపోయింది కానీ.. ఇంకా ఎన్నో మధుర జ్ఞాపకాలను చూసుకుంటూ ఉండేవాళ్లం. ఎంత గొప్పవారికైనా అలాంటి అరుదైన ఫోటోలు, వీడియోలు చూస్తే ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోతాం. మనల్ని మనం చూసుకుంటూ అప్పుట్లో ఇలా ఉన్నామా  అని సంబరపడిపోతాం. అలా తన పాత ఫోటోలను షేర్ చేసింది బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇండోర్‌లో జరిగిన లైవ్‌ షో ఫోటోలు  అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చంది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె మన తెలుగింటి కోడలు ‍అన్న సంగతి తెలుసు. ఆమె సిస్టర్ శిల్పా శిరోద్కర్‌ గురించి చాలామందికి తెలియదు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకైతే సుపరిచితమే. గతేడాది బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇటీవల బాగానే ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర్ మూవీలోనూ నటించింది. గతంలో టాలీవుడ్‌లో బ్రహ్మ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా 90స్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement