టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్‌లోనే ఉంటోంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. అంతేకాకుండా మూగజీవాల కోసం తన వంతు పోరాటం చేస్తున్నారు.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రేణు దేశాయ్.. హీరో పవన్ కల్యాణ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆద్య, అకీరా అనే పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్లకే ఆమె పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సింగిల్‌గానే తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే పేరేంట్స్ విడిపోయినప్పటికీ పిల్లలు తన తండ్రి వద్దకు వెళ్తుంటారు. మెగా ఫ్యామిలీ ఇంటికి కూడా వెళ్తుంటారు. దీనిపై రేణు దేశాయ్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలకు ఏం చెప్తారన్న ప్రశ్నకు రేణు స్పందించింది.
మీరు అక్కడికి వెళ్లి ఎలా ప్రవర్తిస్తారో అదే నా పెంపకాన్ని సూచిస్తుందని వారితో చెప్తానని రేణు దేశాయ్ తెలిపింది. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పెంచిన తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారని పేర్కొంది. అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు.
అందుకే మెగా ఇంటికి వెళ్లేముందు అక్కడ మీరు ఎలా మాట్లాడతారు? ఎలా ఉంటారనేది ముఖ్యమని.. ఒక తల్లిగా నేను సరిగా పెంచానా? లేదా అన్నది డిసైడ్ అవుతుందని వారితో చెప్పానని వెల్లడించింది. ఒక మదర్‌గా నా ఇద్దరు పిల్లలను పెంచడంలో చాలా హ్యాపీగా ఉన్నానని రేణు తెలిపింది. ఒక తల్లిగా తన పెంపకంపై మచ్చ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం తన పిల్లలకు నేర్పించానని రేణు అన్నారు.


