సమంత మెచ్చిన ఇన్‌స్టా రీల్.. ఆమె టాలెంట్‌కు ఫిదా..! | A Women Tailor Created A Reel With Samantha Voice | Sakshi
Sakshi News home page

Samantha: సమంత మెచ్చిన ఇన్‌స్టా రీల్.. ఆమె టాలెంట్‌కు ఫిదా..!

Apr 1 2026 11:11 AM | Updated on Apr 1 2026 11:18 AM

A Women Tailor Created A Reel With Samantha Voice

ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్‌స్టా రీల్స్‌లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్‌స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్‌ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.

తాజాగా ఓ  మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె హీరోయిన్‌తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. 
 

Advertisement
 
Advertisement
Advertisement