దుర్గమ్మ సేవలో రంభ.. రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ | tollywood actress Rambha Visits Vijayawada durgamma temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో రంభ.. రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్

Apr 21 2026 6:58 PM | Updated on Apr 21 2026 7:07 PM

tollywood actress Rambha Visits Vijayawada durgamma temple

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో తన అందచందాలతో స్టార్‌ హీరోయిన్‌గా మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వెంటనే తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, బోజ్‌పురి ఏకంగా ఎనిమిది భాషల్లో 100కుపైగా చిత్రాల్లో నటించారు.

ఇదిలా ఉంచితే తాజాగా రంభ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది వస్తానని తెలిపారు. నేను విజయవాడలోనే పుట్టాను.. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని హీరోయిన్ రంభ తెలిపింది. చిన్నప్పటి దుర్గమ్మ గుడికి వస్తున్నానని వెల్లడించింది.

సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు రంభ స్పందించింది. ఇప్పుడైతే ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదని వెల్లడించింది. కొన్ని కథలు విన్నానని.. నాకు సరిపోయే రోల్స్‌ రాలేదని రంభ చెప్పింది. ఆ కథల్లో ఏవీ తనకు నచ్చలేదని పేర్కొంది. కాగా.. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఇంద్రకుమార్‌ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement