అనుకున్నదే అయింది.. సమంత బంగారం వాయిదా..! | Samantha latest Movie Maa Inti Bangaram Postponed to this Date | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaram: మా ఇంటి బంగారం వాయిదా.. కారణమిదే..!

May 6 2026 8:52 PM | Updated on May 6 2026 8:52 PM

Samantha latest Movie Maa Inti Bangaram Postponed to this Date

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఇ‍ప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదల కానుందని ప్రకటించారు.ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్‌ చేసిన టీజర్‌లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. 

జూన్‌కు వాయిదా..

అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ముందుగా ఊహించినట్లుగానే మా ఇంటి బంగారాన్ని పోస్ట్‌పోన్ చేశారు. ఈ మూవీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చేనెల అంటే జూన్‌ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ నడుస్తుండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement