కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్! | Kajal is ready for Tollywood re-entry, Rakul is still waiting | Sakshi
Sakshi News home page

కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్!

Apr 25 2026 11:49 PM | Updated on Apr 26 2026 5:32 AM

Kajal is ready for Tollywood re-entry, Rakul is still waiting

నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్‌ను ఆ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.

అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్‌లో ఆమెకు పెద్ద గ్యాపే వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్‌లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్‌లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్‌లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement