ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 25-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలబ్ధి

Apr 25 2026 3:50 AM | Updated on Apr 25 2026 3:51 AM

Rasi Phalalu: Daily Horoscope On 25-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.నవమి రా.10.07 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ఆశ్లేష రా.11.35 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: ప.12.48 నుండి 2.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.22 వరకు, అమృత ఘడియలు: రా.10.02 నుండి  11.34 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం     :  6.13
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన వస్తువులు చేజారతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఖర్చులు అధికం.

వృషభం: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిథునం: రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. మానసిక ఆందోళన. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవచింతన.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు.

సింహం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య: సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

తుల: కొత్త పనులు చేపడతారు. బంధువులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.

వృశ్చికం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. చిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు పరిష్కారం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మీనం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement