'పిల్లల కోసం పెళ్లే కానక్కర్లేదు'.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ | Nithya Menen Shocking Comments about Marriage and children | Sakshi
Sakshi News home page

Nithya Menen: 'పెళ్లి కాకుండానే పిల్లలు'.. టాలీవుడ్ హీరోయిన్ నిత‍్యామీనన్

Apr 28 2026 5:28 PM | Updated on Apr 28 2026 6:01 PM

Nithya Menen Shocking Comments about Marriage and children

హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగువారికి పరిచయం ‍అక్కర్లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా మెప్పించింది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. గతేడాది ఇడ్లీ కొట్టు, తలైవన్‌ తలైవి, కాదలిక్కా నెరమిల్లై చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. కేయూరీ ప్రొడక్షన్స్‌ అనే పేరుతో నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు.

అయితే ఇటీవలే 39వ వసంతంలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ పెళ్లి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడింది. తాజాగా మరోసారి పెళ్లిపై నిత్యా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గతంలో సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ముద్దుగుమ్మ.. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని అన్నారు. తాజాగా మరోసారి పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌పై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

పెళ్లికి.. పిల్లల్ని కనడానికి ఎలాంటి సంబంధం లేదని నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అందుకు పెళ్లి ఒక్కటే మార్గం కాదన్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పేం కాదని నిత్యామీనన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కేవలం లైఫ్‌లో ఓ పార్ట్‌ మాత్రమేనని.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. పిల్లల్ని కనడానికి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సింగిల్‌ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement