సమంత బర్త్‌ డే స్పెషల్.. ఫుల్ యాక్షన్‌ వీడియో రిలీజ్ | Maa Inti Bangaaram Movie Team Special Birthday Wishes To Samantha | Sakshi
Sakshi News home page

Samantha: సమంత బర్త్‌ డే స్పెషల్.. సతీమణిపై రాజ్ నిడిమోరు ప్రశంసలు

Apr 28 2026 8:12 PM | Updated on Apr 28 2026 8:12 PM

Maa Inti Bangaaram  Movie Team Special Birthday Wishes To Samantha

ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు కావడంతో స్పెషల్ వీడియో రిలీజైంది. సామ్‌కు బర్త్‌ డే విషెస్ చెబుతూ ప్రశంసలు కురిపించారు మా ఇంటి బంగారం టీమ్. ఈ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసిన వీడియో సామ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సామ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

ఈ సందర్భంగా సామ్‌ నటనపై ప్రశంసలు కురిపించారు. సమంత స్టంట్స్‌ అదరగొట్టేశారని హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ లీ కొనియాడారు. సమంతను బీస్ట్‌ అంటూ ఆకాశానికెత్తారు. ఎలాంటి సీన్స్‌లోనైనా అద్భుతంగా చేయగలదని డైరెక్టర్ నందిని రెడ్డి ప్రశంసించారు. సామ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటి అని డీవోపీ ఓంప్రకాశ్‌ అన్నారు. ఆమె యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. సామ్ భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైతం సమంత నటన ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందన్నారు. అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. కాగా.. సమంత తన సొంతం బ్యానర్‌లో నిర్మిస్తోన్న ఈ చిత్రం  మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement