రేర్ పిక్‌ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫోటోలో ఎక్కడుందో తెలుసా? | tollywood actress Madhavilatha Shares Her Degree College days pic | Sakshi
Sakshi News home page

Tollywood Actress: టాలీవుడ్ హీరోయిన్ అరుదైన పిక్‌.. ఆమె ఎవరో తెలుసా?

Apr 26 2026 4:58 PM | Updated on Apr 26 2026 5:08 PM

tollywood actress Madhavilatha Shares Her Degree College days pic

మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఆనాటి రేర్‌ పిక్‌ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.

నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement