మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక | Niharika Konidela Comments at Rakasa Pre Release Event | Sakshi
Sakshi News home page

Niharika Konidela: నా డ్రీమ్ అదే.. రాకాస ఈవెంట్‌లో నిహారిక

Mar 31 2026 10:49 AM | Updated on Mar 31 2026 1:51 PM

Niharika Konidela Comments at Rakasa Pre Release Event

మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్‌ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై రాకాస అనే మూవీని నిర్మించారు.  సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.

ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్‌ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement