యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్ | Tollywood actress Anasuya post on aunty case in UK | Sakshi
Sakshi News home page

Anasuya: యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్

Apr 10 2026 9:17 PM | Updated on Apr 10 2026 10:17 PM

Tollywood actress Anasuya post on aunty case in UK

టాలీవుడ్ నటి అనసూయ యాంకర్‌గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.

తాజాగా అనసూయ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్‌లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను అనసూయ తన ట్విటర్‌లో షేర్ చేసింది. హమ్‌ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)

కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్‌కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement