'మీ హేమక్క ఎప్పుడు ‍అలా చేయదు'.. వీడియో రిలీజ్‌ | Tollywood actress Hema released avideo at pub goes viral | Sakshi
Sakshi News home page

Hema: 'మీ హేమక్క ఎప్పుడు ‍అలా చేయదు'.. వీడియో రిలీజ్‌

Apr 3 2026 11:36 AM | Updated on Apr 3 2026 11:50 AM

Tollywood actress Hema released avideo at pub goes viral

టాలీవుడ్ నటి హేమపై గతేడాది డ్రగ్స్‌ కేసు నమోదైంది. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు  పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ప్రెస్ మీట్‌లోనూ తనకు పాజిటివ్ రాకుండానే.. వచ్చిందని రాసుకొచ్చారని తన బాధను పంచుకుంది.

తాజాగా నటి హేమ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ప్రస్తుతం కొండాపూర్‌లోని పబ్‌కి వచ్చానని తెలిపింది. పోలీసుల రైడ్‌లో  కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అక్కడే ఉన్న నన్ను కూడా టెస్ట్ చేశారని.. కానీ నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రేపు మళ్లీ ఈ వీడియోను పోస్ట్ చేస్తాను.. మీ హేమక్క ఎప్పుడు తప్పు చేయదు.. జెన్యూన్‌గా ఉంటుంది.. ముక్కుసూటిగా ఉంటది.. లవ్ యూ ఆల్' అంటూ వీడియోలో మాట్లాడారు హేమ.

 

Advertisement
 
Advertisement
Advertisement