టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. తన క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నీ వద్ద ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టాలని అతనికి గడ్డిపెట్టింది. నాకు రిలేషన్స్ ఉన్నా.. లేకపోయినా.. నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదని మండిపడింది. ఒక వేళ నేను పెళ్లి చేసుకునే వరకు ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదంటూ హితవు పలికింది. మహిళ దినోత్సవం రోజే యాంకర్ రష్మి వేధింపులకు గురికావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రష్మీ గౌతమ్ తన ట్వీట్‌లో రాస్తూ..'ముందు రుజువులు చూపించు. రెండోది.. నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా.. నాపై వేధింపులు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు ఎంతమందితో తీరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరితో లింక్ ఉందో దయచేసి వాలా పేర్లు ప్రూఫ్‌తో సహా చెప్పండి. నా ఒక్క పేరు ఎందుకు. మీరు ఎవరి క్యారెక్టర్‌నైనా కించపరచాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి. అది న్యాయం' నెటిజన్‌కు ఫుల్‌గా గడ్డిపెట్టేసింది.
First and foremost show the proof
Secondly no matter how many relationships I have or not
No one has the right to abuse me
And until and unless I’m getting married to you or or your father or your son
Neenu yetha mandi tho teerigina aadi mee problem kadu
Also naku yevari… https://t.co/RPYQ8fZj50— rashmi gautam (@rashmigautam27) March 8, 2026


