ధనుశ్‌తో డేటింగ్ రూమర్స్.. వీరిద్దరు ఆ పని చేయనున్నారా? | Dhanush to direct a female lead film with Mrunal Thakur amid rumours | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ధనుశ్‌తో డేటింగ్ రూమర్స్.. నిజంగా అది సాధ్యమేనా?

Apr 21 2026 9:31 PM | Updated on Apr 21 2026 9:32 PM

Dhanush to direct a female lead film with Mrunal Thakur amid rumours

సీతారామం ఫేమ ‍మృణాల్ ఠాకూర్ ఇటీవలే డకాయిట్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్‌ గురించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుశ్ డైరెక్షన్‌లో ఆమె పని చేయనున్నారని లేటేస్ట్ టాక్. ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ కోసం మృణాల్‌ను సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. 

ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా.. 1960 లేదా 1970ల కాలానికి సంబంధించిన ఒక 'పీరియడ్ డ్రామా'గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే తాజాగా వీరిద్దరి సినిమా గురించి టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు వీరి రిలేషన్‌పై చర్చ మొదలైంది. గతంలో మృణాల్‌- ధనుశ్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. గతేడాది ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్ వేడుకలో ధనుశ్ కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతకుముందు ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' సినిమా ముగింపు వేడుకలో మృణాల్ ఠాకూర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ధనుష్ కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో అవ్వడంతో వీరిద్దరు రిలేషన్‌కు మరింత బలం చేకూరింది. అయితే తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఎక్కడా నోరు విప్పలేదు. గతంలో తన మూవీ 'దో దీవానే షహర్ మే' ఈవెంట్‌లో  పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై మృణాల్ ఠాకూర్ స్పందించారు. తనపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇటువంటి వార్తలు చాలా సందర్భాల్లో నిరాధారంగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ధనుశ్ నటించిన 'కారా' మూవీ విడుదల కానుంది. 1991 గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement