తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్ | tollywood actress Sreeleela Visited Tirumala for Blessings | Sakshi
Sakshi News home page

Sreeleela: తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్

Apr 10 2026 7:14 PM | Updated on Apr 10 2026 7:24 PM

tollywood actress Sreeleela Visited Tirumala for Blessings

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.  ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్‌లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement