ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనిపిస్తోంది.. హేమ ఆవేదన | Tollywood actress Hema comments about Her news in Social media | Sakshi
Sakshi News home page

Hema: ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనిపిస్తోంది.. హేమ ఆవేదన

Mar 30 2026 1:28 PM | Updated on Mar 30 2026 1:38 PM

Tollywood actress Hema comments about Her news in Social media

టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ హేమ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తన గురించి తెలిసి కూడా అలా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో తనకు పాజిటివ్ అని రాకుండానే.. వచ్చిందని ప్రచారం చేశారని ఆరోపించింది. ఇదంతూ చూస్తుంటే ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగానని.. నేను మీ అందరికీ తెలుసు కదా అని ప్రశ్నించింది. నాకు కూడా ఫ్యామిలీ ఉందని.. మా బాధలు అర్థం చేసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఏదైనా నిర్ధారణ  అయ్యాకే రాయాలని హేమ సూచించింది. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరని అ‍న్నారు. 

సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ హేమపై గతేడాది డ్రగ్స్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు  పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. మరి అదే కేసును కోర్టు కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement