అనంతపురం : రైతులు తమ ఇంట పశువులనుకన్నబిడ్డల్లా చూసుకుంటారు. వాటికి ఏదైనా కష్టమొస్తే తల్లడిల్లిపోతుంటారు.
అలాంటి మూగజీవాలను ప్రస్తుతం అయిష్టంగానే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.
ఓవెపు గ్రాసం కొరత, మరో వైపు ఆర్థిక ఇబ్బందులు వెరసీ రైతన్నలు తమ పశువులను అనంతపురం మార్కెట్యార్డులోని సంతకు తీసుకొచ్చి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఆదివారం పశువుల సంతలో కనిపించిన దృశ్యాలివీ..
(ఫొటోలు) – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


