అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు.
కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️
Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.
Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026
ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.
Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.
A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026


