లక్కీ హీరోయిన్లలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో ఈమె తొలి నుంచి స్టార్ హీరోలతోనే జత కడుతున్నారు. తెలుగులో మొదటగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రంలో జత కట్టారు. ఆ తరువాత విజయ్‌దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించారు. ఆ తరువాత తమిళంలో దుల్కర్సల్మాన్, రానాలతో కలిసి కాంతా చిత్రంలో నటించారు. తాజాగా తమిళంలో నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను కొట్టేశారు.
ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది ఇంతకు ముందు కమలహాసన్ నటించిన విరుమాండి చిత్రం తరహాలో కరుమాత్తూర్ దైవాల ఇతి వృత్తంతో సాగుతుందని సమాచారం. మదురై నేపధ్యంలో యాక్షన్, కామెడీ అంశాలతో గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా సెయోన్ ఉంటుందని తెలిసింది.
కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ఓ భేటీలో తెలుపుతూ కమలహహాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే ఈ చిత్రం గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేనన్నారు. అయితే ఈ చిత్రానికి తన పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.
తనను ఉత్తమ నటిగా ప్రేక్షకులకు చూపుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రేక్షకులకు నిజాయితీగా ఉండాలంటే తాము నటించే చిత్రాల భాషను తెలుసుకోవాలన్నారు. అందుకే తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కింగ్డమ్ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పానని అన్నారు. అదే విధంగా ఇప్పుడు సెయోన్ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు భాగ్యశ్రీ బోర్సే చెప్పారు.


