Seyon Movie
-
ఆ సినిమాలో నా పాత్రే చాలా కీలకం: భాగ్యశ్రీ బోర్సే
లక్కీ హీరోయిన్లలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో ఈమె తొలి నుంచి స్టార్ హీరోలతోనే జత కడుతున్నారు. తెలుగులో మొదటగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రంలో జత కట్టారు. ఆ తరువాత విజయ్‌దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించారు. ఆ తరువాత తమిళంలో దుల్కర్సల్మాన్, రానాలతో కలిసి కాంతా చిత్రంలో నటించారు. తాజాగా తమిళంలో నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను కొట్టేశారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది ఇంతకు ముందు కమలహాసన్ నటించిన విరుమాండి చిత్రం తరహాలో కరుమాత్తూర్ దైవాల ఇతి వృత్తంతో సాగుతుందని సమాచారం. మదురై నేపధ్యంలో యాక్షన్, కామెడీ అంశాలతో గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా సెయోన్ ఉంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ఓ భేటీలో తెలుపుతూ కమలహహాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే ఈ చిత్రం గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేనన్నారు. అయితే ఈ చిత్రానికి తన పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. తనను ఉత్తమ నటిగా ప్రేక్షకులకు చూపుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రేక్షకులకు నిజాయితీగా ఉండాలంటే తాము నటించే చిత్రాల భాషను తెలుసుకోవాలన్నారు. అందుకే తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కింగ్డమ్ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పానని అన్నారు. అదే విధంగా ఇప్పుడు సెయోన్ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు భాగ్యశ్రీ బోర్సే చెప్పారు. -
బర్త్ డే బ్యూటీ.. ట్రెండింగ్ హీరోయిన్ని గుర్తుపట్టారా?
సాధారణంగా సినిమాలు హిట్ అయితే హీరోయిన్లకు క్రేజ్ వస్తుంది. కొన్నిసార్లు ఫలితంతో సంబంధం లేకుండా ఫ్లాప్స్ అందుకున్నా సరే కొందరు బ్యూటీస్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ల ఈమె ఒకరు. మరో రెండు నెలల్లో ఈ భామ హీరోయిన్గా చేసిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన మీసకట్టుతో తలపై కిరీటంతో కనిపిస్తున్న ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ముంబైకి చెందిన ఈమె.. రవితేజ 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీనే ఘోరమైన డిజాస్టర్. అయినా సరే 'కింగ్డమ్', 'కాంత' లాంటి పాన్ ఇండియా మూవీస్‌లో అవకాశాలు అందుకుంది. కానీ ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. గతేడాది చివరలో వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలుకా' కూడా ఫ్లాప్ అయింది.ప్రస్తుతం భాగ్యశ్రీ చేస్తున్న తెలుగు సినిమా 'లెనిన్' మాత్రమే. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చితం.. జూన్ 26న థియేటర్లలోక రానుంది. ఇది హిట్ కావడం అఖిల్‌కి ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే తెలుగులో మరికొన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే పరిస్థితి కష్టమైపోవచ్చు. ఇకపోతే శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'సెయాన్' మూవీతో భాగ్యశ్రీ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?) -
కుమారస్వామి ఆవహిస్తే? కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ.. 'అమరన్'తో పాటు తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. గతేడాది 'మదరాశి' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'పరాశక్తి' అనే పీరియాడికల్ చిత్రం చేశాడు. తమిళంలో మాత్రమే ఇది థియేటర్లలో రిలీజైంది. తెలుగు కూడా చేద్దామనుకున్నారు గానీ ఎందుకనో వెనకడుగు వేశారు. నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇకపోతే ప్రస్తుతం 'సెయాన్' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి కమల్‌హాసన్ నిర్మాత. శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)దాదాపు మూడున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియో బట్టి చూస్తే.. 'సెయాన్' చిత్రం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. అయితే ఇందులో శివకార్తికేయన్.. పూర్తిగా రస్టిక్ లుక్‌లో కనిపించనున్నాడు. కుమారస్వామి ఇతడికి ఆవహించడం లాంటి ఎలిమెంట్ కూడా చూపించారు. 'సెయాన్' అంటేనే కుమారస్వామికి మరోపేరు. టైటిలే ఇది పెట్టారంటే కచ్చితంగా ఇందులో కుమారస్వామి గురించి కాస్తో కూస్తో చూపించడం గ్యారంటీ. కాకపోతే మూడున్నర నిమిషాల వీడియోలో చాలావరకు తమిళ ఫ్లేవర్ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. ఇదే ఇతడికి మొదటి సినిమా.ఇకపోతే త్రివిక్రమ్ కూడా కుమారస్వామికి చెందిన 'గాడ్ ఆఫ్ వార్' కథతో ఓ సినిమా తీయాలని అనుకున్నారు. తొలుత అల్లు అర్జున్ హీరో అనుకున్నారు గానీ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో దీన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)


