‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’ | Deputy CM Bhatti Vikramarka On Bharat Summit | Sakshi
Sakshi News home page

‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’

Apr 25 2025 7:23 PM | Updated on Apr 25 2025 7:26 PM

Deputy CM Bhatti Vikramarka On Bharat Summit

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చారిత్మాకమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ లో గ్లోబల్ జస్టిస్  కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. హెచ్ఐసీసీ వేదికగా తొలిరోజు జరిగిన భారత్ సమ్మిట్ గురించి మల్లు భట్టి విక్రమార్క్ మీడియాతో మాట్లాడారు.

‘గ్లోబల్ జస్టిస్  కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్, శాంతి తదితర   అంశాలపై సమ్మిట్ లో చర్చించారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై డెలిగేట్స్ తో చర్చించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల  విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ న్యాయ్ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడికి నిరసనలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటామని అన్నారు. కశ్మీర్ ఉగ్రవాద దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.నెక్లెస్ రోడ్డులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు’ అని మల్లు భట్టి విక్రమార్క  తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement