భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్ధం | Fire accident in Hayatnagar | Sakshi
Sakshi News home page

భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్ధం

Apr 27 2025 8:10 AM | Updated on Apr 27 2025 8:10 AM

Fire accident in Hayatnagar

హయత్‌నగర్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుంట్లూరులోని వివాదాస్పద స్థలంలోని గుడిసెల్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగి సుమారు 300 పైగా గుడిసెలు అగ్ని ఆహుతయ్యాయి. మంటలు ఎగిసి పడుతూ విస్తరిస్తుండడంతో బాధితులు గుడిసెల నుంచి బయటికి పరుగులు తీశారు. ఐదు అగ్ని మాపక వాహనాలతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  

ఎలా జరిగిందంటే. ? 
కుంట్లూరు సర్వేనెంబర్‌ 214 నుంచి 224 వరకు ఉన్న సుమారు 100 ఎకరాలు భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ భూమి తమకు చెందుతుందని ప్రైవేటు వ్యక్తులు వాదిస్తుండగా ఇది భూదాన భూమి అని సీపీఐ నాయకులు వాదిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో కొనసాగుతుండగా సీపీఐ ఆధ్వర్యంలో రెండేళ్ళ క్రితం వేలాది మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు.  కోర్టు వివాదం ఉన్న భూమిలోని గుడిసెలలో అగ్రి ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా తగలబెట్టారా... ప్రమాద వశాత్తు జరిగిందా... 

 అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  సంఘటనా స్థలాన్ని డీసీపీ ప్రవీణ్‌కుమార్, సీఐ నాగరాజుగౌడ్, ట్రాఫిక్‌ సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సందర్శించారు.ఈ ప్రమాదంపై అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి  మాట్లాడుతూ.. గుడిసెలు తగులబడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement