‘హరీష్‌ సినిమా డైలాగులు బంద్‌ చేయాలి’ | TPCC Working President Jaggareddy Takes On Harish Rao | Sakshi
Sakshi News home page

‘హరీష్‌ సినిమా డైలాగులు బంద్‌ చేయాలి’

Jul 12 2026 9:19 PM | Updated on Jul 12 2026 9:20 PM

TPCC Working President Jaggareddy Takes On Harish Rao

హైదరాబాద్‌:   కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. హరీష్‌రావు సినిమా డైలాగులు బంద్‌ చేయాలంటూ మండిపడ్డారు. ఈరోజు(ఆదివారం, జూలై 12వ తేదీ) గాంధీ భవన్‌లో మాట్లాడిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని, బీఆర్‌ఎస్‌ తన మాటను నిలబెట్టుకోదంటూ విమర్శించారు. 

‘ నీకు నచ్చపోతే సైకో లు అవుతారా హరీష్ రావు.. హరీష్ మాట లో  పస లేదు. ఉద్యమంలో మీ మాటలు విని  జనాలు బలి  చేసుకున్నారు. కాళేశ్వరం విషయంలో  సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవం. 

కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో చర్చకు రావాలి. ఆయనకు కూడా ముట్టింది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్‌తో కలిసి పని చేశావు కదా ఈటెల రాజేందర్. డిల్లీ కేంద్ర ఇరిగేషన్ మంత్రితో రాష్ట్ర నేతలకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య ఏంటో తెలుస్తుంది కదా. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే మాకు సరిపోతుంది’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement