హైదరాబాద్‌లో ఆజాద్‌ ఇంజినీరింగ్‌ తయారీ ప్లాంటు | Azad Engineering inaugurates lean manufacturing facility in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆజాద్‌ ఇంజినీరింగ్‌ తయారీ ప్లాంటు

Apr 30 2025 3:48 AM | Updated on Apr 30 2025 7:59 AM

Azad Engineering inaugurates lean manufacturing facility in Hyderabad

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్‌ పవర్‌ సర్వీసెస్‌ అవసరాల కోసం హైదరాబాద్‌లో లీన్‌ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఆజాద్‌ ఇంజినీరింగ్‌ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్‌ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్‌ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్‌ రాకేష్‌ చోప్దార్‌ వివరించారు. 

ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్‌..గ్యాస్‌ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement