యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో భారీ పేలుడు | Major Explosion At Premier Explosives Company in Yadadri Bhongir District | Sakshi
Sakshi News home page

యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో భారీ పేలుడు

Apr 29 2025 8:13 PM | Updated on Apr 29 2025 8:26 PM

Major Explosion At Premier Explosives Company in Yadadri Bhongir District

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement