వారణాసి మేకర్స్‌కు షాక్.. మహేశ్ బాబు వీడియో లీక్...! | Mahesh Babu Varanasi action video surfaces online goes Viral | Sakshi
Sakshi News home page

Varanasi Movie: వారణాసి మేకర్స్‌కు షాక్.. మహేశ్ బాబు వీడియో వైరల్...!

Aug 6 2026 8:27 PM | Updated on Aug 6 2026 8:58 PM

Mahesh Babu Varanasi action video surfaces online goes Viral

రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్‌ మూవీ వారణాసి. ప్రస్తుతం ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు దర్శకధీరుడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్‌ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈనెల 8న మహేశ్ బాబు బర్త్‌ డే కావడంతో ఏదైనా అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  వారణాసికి సంబంధించి బర్త్‌ డే గ్లింప్స్‌ కానీ, పోస్టర్స్‌ కానీ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వారణాసి మేకర్స్‌ కొత్త తలనొప్పి మొదలైంది. వారణాసి షూట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియోగా తెలుస్తోంది. వాటర్‌లో మహేశ్ బాబు ఫైట్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో మళ్లీ వారణాసికి లీకుల బెడద మొదలైంది. గతంలో ఓసారి లీక్ బారిన పడిన వారణాసి మరోసారి అదే రిపీట్ అయింది. అయితే ఈ వీడియో క్లిప్‌పై మేకర్స్ ఇంకా స్పందించలేదు.

వారణాసి మూవీ పదేపదే  లీక్‌ల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు వారణాసి సెట్స్ చిత్రాలు, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్, అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లోని కొన్ని భాగాలు అధికారిక విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వీడియో రావడంతో మేకర్స్ ఆందోళన చెందుకున్నారు.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారతీయ చిత్రాలలో అత్యధికంగా లీకుల బారిన పడుతున్న చిత్రాలలో ఒకటిగా వారణాసి నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement