లేడీ సూపర్‌స్టార్ నయనతార, కవిన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ హాయ్. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని వెల్లడించారు. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
సూర్యతో నయన్ ఢీ..
అయితే అదే రోజున సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీకి వెంక అట్లూరి దర్శకత్వం వహించారు. దీంతో నయనతార.. సూర్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. హాయ్ మూవీ పోటీలోకి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తిగా మారింది. కాగా.. 'హాయ్' చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ తమ బ్యానర్ 'రౌడీ పిక్చర్స్, 'సెవెన్ స్క్రీన్ స్టూడియో', 'జీ స్టూడియోస్' భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు.


