ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు. పండుగైనా, వేడుకైనా వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే. ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్ అవ్వకూడదు. అదీ అతని కమిట్‌మెంట్. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్‌ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు. కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో నెట్టింట వైరల్ అవుతోంది. వాట్ ఏ కమిట్‌మెంట్ బ్రో అని నీ డెడికేష్‌కి సలాం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.
నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు
ఇదీ చదవండి : అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?
The way he said "you guys carry on" Shows the level of passion 🤍 pic.twitter.com/PeR4mB15W6
— .. (@Superoverr) January 22, 2026


