వివాహేతర సంబంధాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పలు సందర్భాలు నెట్టింట లేదంటే వార్తల రూపంలో వైరల్ అయ్యేది చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో తమ భాగస్వాముల మోసాన్ని.. పరాయి వాళ్లతో ఆ స్థితిలో చూసి భరించలేక దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన దృశ్యాలు కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
‘‘హలో.. పోలీస్ స్టేషన్ ఆ నా భర్త నన్ను మోసం చేస్తోంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మీరు వస్తే వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు’’ అంటూ ఫోన్ చేశాడు ఓ భర్త. ఆ కాల్ అందుకుని ఆగమేఘాల మీద ఓ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త.. వాళ్లను చూడగానే ఉరుకుల మీద రూమ్ నెంబర్ 113 తలుపును విరగొట్టాడు.
లోపల ఏకాంతంగా గడుపుతున్న ఓ జంట.. ఆ అలజడికి ఉలిక్కి పడింది. వెంటనే మంచం మీద ఉన్న వ్యక్తి.. మంచం కిందకు దూరాడు. ఈలోపు ఆ భర్త గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది, రోడ్డు మీద పోతున్న వాళ్లు అక్కడికి చేరారు. మంచం కింద దాక్కున్నవాడ్ని బయటకు లాగారు. వాళ్లందరిరి సమక్షంలో తనని తిట్టిపోస్తున్న భర్తను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొందామె.
‘‘అవును.. ఇతను నా ప్రియుడే. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చా. నేను నా భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం. అందుకే అతనింకా నా జీవితంలో భాగం కాదని ఫిక్స్ అయ్యా. అందుకే నాకిష్టమైన వ్యక్తితో జీవించాలని ఫిక్స్ అయ్యా. అందుకే నా భర్త నుంచి విడాకులు కోరుతున్నా’’ అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఈలోపు.. భర్త పోలీసులకు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు.
పెళ్లైనప్పటి నుంచే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. 2023లో భార్య తరఫు వాళ్లు కేసు పెట్టినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నామని, కానీ ఆమె మళ్లీ గొడవ పెట్టుకుని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి మరో వ్యక్తికి దగ్గరైందని.. ఇప్పుడు విడాకుల కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేస్తోందని వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పోటాపోటీగా వాదించుకోవడంతో పోలీసులు వాళ్లను పీఎస్‌కు తీసుకెళ్లారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ నగరంలోని నవాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..
🚨 होटल ड्रामा, VIDEO वायरल 🚨
🏨 पत्नी प्रेमी संग, पति 👮♂️ पुलिस के साथ पहुंचा
😱 पकड़े जाने पर बोली— “तलाक दे दूंगी”
📍 वायरल वीडियो झांसी (UP) बताया जा रहा#Jhansi #UPNews #ViralVideo #BreakingNews pic.twitter.com/yX4Z3ggciQ— Mr Kushal Gupta,( K G ) (@g94897659) January 16, 2026


